యూరో జోన్ లో (యూరోను కరెన్సీగా అంగీకరించిన యూరప్ దేశాలు) రుణ సంక్షోభంలో ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై పొదుపు బడ్జెట్ నీ, పొదుపు ఆర్ధిక విధానాలనీ ప్రజలపై రుద్ధుతోంది. ఇప్పటికే సగం చచ్చి ఉన్న కార్మికులు, ఉద్యోగులపై మరిన్ని కోతలు, రద్దులు ప్రకటించడంతో వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. బ్యాంకులు, కంపెనీలకు పన్నుల రాయితీలు కొనసాగిస్తూ, వీలతై మరిన్ని రాయితీలిస్తూ, ప్రజలపైన పన్నులు బాదుతున్నారు. ఇది దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
కొంత కాలానికి కార్మికులు “రోజుకి రండు పూటలా తినడానికి తిండి దొరుకుతోంది. అదే సంతోషం” అని భావించే స్ధితికి నెట్టేలా వారిపై వరుస భారాలు మోపుతున్నారు. దేశం దివాలా తీస్తున్నదని చెప్పి ఆ వంకతో ప్రజల్ని దివాలా తీయిస్తున్నారు.
–
“… … … వీళ్ళు ఆపరు. రెండు పూటలా తిండి దొరుకుతోంది, అదే పదివేలు అని కృతజ్ఞతతో పడి ఉండే బానిసలుగా మార్చేదాకా వీళ్ళు ఆపరు!”
–
కార్టూనిస్టు: జువాన్ కల్వెల్లిడో, స్పెయిన్
–
