2008 తర్వాత అతి తక్కువ స్ధాయికి ఈ వారం షేర్లు పడిపోవడం, అమెరికా అప్పు డిఫాల్ట్ అవుతుందన్న భయాలు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసిదని భావిస్తున్నారు. కంపెనీలు ఉద్యోగాల నియామకానికి వెనకాడతుండడంతో నిరుద్యోగం ఇంకా 9 శాతానికి పైగానే కొనసాగుతుండడం కూడా వినియోగదారుల విశ్వాసం పై ప్రభావం చూపింది. నిరాశావాదం కుటుంబాల ఖర్చుని మరింత దిగజార్చగలదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ విధాన రూప కర్తలు ఇప్పటికే ఈ వారం వినియోగదారుల ఖర్చులు గణనీయంగా నెమ్మదిస్తాయని అంచనా వేయడం విశేషం.
బ్లూమ్‌బర్గ్ వినియోగదారుల కంఫర్ట్ సూచి కూడా రాయిటర్స్ సూచి రీడింగ్ లను ధృవ పరిచింది. అగష్టు నాటికి అది -49.1 స్ధాయికి అది పడిపోయింది. వర్తమాన స్ధితిగతులపై నిర్వహించిన మిచిగాన్ సర్వే సూచి కూడా రాయిటర్స్ సూచి ఫలితాలను ధృవపరిచింది. దాని ప్రకారం కార్లలాంటి అధిక ధరల సరుకుల కొనుగోలుకు వర్తామాన పరిస్ధుతులు అనువైనవా కావా అన్నదానిపై అనుకూలత గత నెల 75.8 పాయింట్లు ఉండగా, ఆగష్టులో అది 69.3 కి పడిపోయింది. అలాగే తదుపరి ఆరు నెలలకు వినియోగదారుల అంచనాలు ఏ స్ధాయిలో ఉంటాయో సూచించే సూచిక గత నెల 56 ఉండగా, ఈ నెల 45.7 కు తగ్గింది. ఇది తదుపరి ఆరు నెలలో వినియోగదారుల ఖర్చులు ఈ స్ధాయిలో ఉంటాయో తెలియజేస్తుంది.
ఫెడరల్ రిజర్వ్ విధాన కర్తలు సేకరించిన వివరాల ప్రకారం అమెరికా ప్రజలు తదుపరి ఐదు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 2.9 శాతం ఉంటుంద. గత నెల కూడా ఇదే స్ధాయిలో ఉండడం కొనసాగుతోంది. జులైలో అమెరికా కంపెనీలు 117,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. మరోవైపు గ్యాస్ ధరలు అధికం కావడంతో వినియోగధారుల డబ్బు మార్కెట్ ఖర్చులకు తక్కువగా అందుబాటులో ఉంటోంది. వడ్డీ రేట్లను 2013 మధ్య వరకూ 0.25 శాతం వద్దనే కొనసాగిస్తామని ఫెడరల్ ప్రకటించింది. అమెరికా వృద్ధి రెటుని కొనసాగించడానికి అవసరమైన ఇతర పరికారాలను కూడా వినియోగిస్తామని ఆ సంస్ధ తెలిపింది. ఎస్&పి రేటింగ్ తగ్గుదలతో షేర్లు అధమ స్ధాయికి పడిపోవడంతో షేర్ల పతనాన్ని అడ్డుకోవడానికి ఫేడరల్ రిజర్వ్ ఈ ప్రకటన చేసిందని భావిస్తున్నారు.
