అట్లాంటిక్ సముద్రానికి అవతల ఒడ్డున అమెరికా రేటింగ్‌ని, స్టాండర్డ్ & పూర్ సంస్ధ AAA నుండి AA+ కి తగ్గించింది. హిందూ మహా సముద్రానికి ఇవతలి ఒడ్డున భారత ప్రజలు ప్రధాని మన్మోహన్ రేటింగ్‌ని AAA నుండి AA+ కి తగ్గించేశారు. అదే చేత్తో ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ రేటింగ్ లు ఏమీ లేని రాహుల్ గాంధీకి అమాంతం AAA రేటింగ్ ఇచ్చేశారు.
సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ మరియు సి.ఎన్.బి.సి-టి.వి18 సంస్ధల ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్’ ను, “సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్” సంస్ధ నిర్వహించింది. దీనిలో వివిధ అంశాలతో పాటు నాయకుల పనితీరు, వారికి ప్రజల్లో గల ఆమోదాన్ని కూడా సర్వే చేశాయి. ఇందులో మన్మోహాన్ రేటింగ్ గతం కంటే పడిపోగా, నిన్న మొన్నటివరకూ అట్టడుగున ఉన్న రాహుల్ అమాంతం అగ్ర స్ధానాన్ని ఆక్రమించాడు.
మన్మోహన్ ఇప్పుడిప్పుడు దిగిపోవాలని 33 శాతం కోరుకుంటే, దిగిపోవాలని 22 శాతం కోరుకుంటున్నారు. ఆయన నీతిమంతుడైనా అవినీతిని నియంత్రించడానికి ఏమీ చేయలేదని 31 శాతం భావిస్తుంటే, చేయగలిగింది చేశాడని 27 శాతం భావిస్తున్నారు. సర్వే ఫలితాలను టేబుల్ లో చూడవచ్చు.


I still think Mr.Rahulgandhi is not the best choice.A more capable and strong man(or woman)should emerge as the leader of our nation.