గత శుక్రవారం అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఎస్&పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అత్యున్నత రేటింగ్ AAA నుండి రెండో అత్యున్నత రేటింగ్ AA+ కి తగ్గించింది. దానితో అమెరికా ప్రభుత్వం, కంపెనీలు, వినియోగదారులకు అప్పుల ఖరీదు (వడ్డీ రేటు) పెరిగిపోయింది. దానివలన పెట్టుబడులు తగ్గి, అప్పటికే అనేక బలహీనతలతో తీసుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణిస్తుందనీ, అమెరికా మరొక సారి మాంద్యానికి (రిసెషన్) గురై అది ప్రపంచం అంతా వ్యాపిస్తుందనీ ఒక్క సారిగా భయాలు ఇన్‌వెస్టర్లను ముంచెత్తాయి. ఫలితంగా షేర్ మార్కెట్లలో అమ్మకాలు శరవేగంగా పెరిగిపోయి, వివిధ దేశాల షేర్ సూచిలు దాదాపు సంవత్సరం ముందు స్ధాయికి పడిపోయాయి.
ప్రపంచంలోని వివిధ స్టాక్ ఎక్చేంజిలలో షేర్ల పతనాన్ని అందరికంటే ముందుగా వీక్షించే బ్రోకర్లు, వ్యాపారులు, ఇన్‌వెస్టర్లు కంప్యూటర్ మానిటర్ల ముందు కూచుని వ్యక్తం చేసిన హావ భావాలను రాయిటర్స్ ఫోటో విలేఖరి కెమెరాలో బంధించి అందించాడు. అవి ఇక్కడ:
- అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో ఆగస్టు 5 న ప్రపంచవ్యాపితంగా ‘బేర్ మార్కెట్’ గర్జించింది
- ముంబైలోని ఒక బ్రోకరేజి సంస్ధలో పతనమవుతున్న షేర్ల ధరలను వీక్షిస్తూ ఓ బ్రోకర్
- కరాచి స్టాక్ ఎక్ఛేంజిలో ఓ బూత్ వద్ద ఒక మదుపుదారుడు షేర్ల ధరలను పరిశీలిస్తున్న దృశ్యం. అద్దంలో ప్రతిఫలిస్తున్న కంప్యూటర్ మానిటర్లు
- ఆగష్టు 5 న కరాచి స్టాక్ ఎక్ఛేంజిలో కంప్యూటర్ స్క్రీన్ల వెలుతురులో ఒక ఇన్వెస్టర్ మొఖం
- చైనా, లియావోనింగ్ రాష్ట్రం, షెన్యాంగ్ నగరంలోని ఒక బ్రోకరేజి సంస్ధలో షేర్ల ధరలు పరికిస్తున్న చైనీయులు
- హాంకాంగ్ లోని ఒక స్టాక్ ట్రేడింగ్ కంపెనీలో ఆగస్టు 5న షేర్ల పతనంతో డీలా పడ్డ ఒక ఇన్వెస్టర్
- హాంగ్ కాంగ్ లో షేర్ల సూచి హ్యాంగ్ సంగ్ అధో పతనాన్ని వీక్షిస్తున్న మదుపుదారుడు
- ఆగస్టు 4న న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజిలో పూర్తి స్ధాయి కరెక్షన్ను వీక్షిస్తున్న ఒక షేర్ల వ్యాపారి
- ఆగస్టు 4న న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజిలో షేర్ల పతనం పట్ల స్పందిస్తున్న వ్యక్తి
- ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్ఛేంజి లో జర్మనీ షేర్ల సూచి డి.ఏ.ఎక్స్ షేర్ల బోర్డ్ ముందు ఫోమ్ తయారి ఎలుగుబంటి బొమ్మ
- ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్ఛేంజిలో ఓ షేర్ల వ్యాపారి ఆగస్టు 9 ప్రారంభంలో షేర్ల పతనం పట్ల స్పందిస్తున్న దృశ్యం
- ఫ్రాంక్ ఫర్ట్ స్టాక్ ఎక్ఛేంజిలో ఓ షేర్ల వ్యాపారి ఆగస్టు 9 ప్రారంభంలో షేర్ల పతనం పట్ల స్పందిస్తూ ప్రదర్శించిన వివిధ హావ భావాలు











