అమెరికా రుణ సంక్షోభం పుణ్యమాని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు మళ్ళీ కనపడుతున్నాయి. సోమవారం కుప్ప కూలిన షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనాన్ని కొనసాగిస్తున్నాయి. జారడం మొదలవ్వాలేగానీ ఎక్కడ ఆగుతామో తెలియదన్నట్లుగా ఉంది షేర్ మార్కెట్ల పరిస్ధితి. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా లలోని ప్రధాన షేర్ సూచీలన్నీ పతన దిశలో సాగుతూ ఇన్‌వెస్టర్లను, వ్యాపారులనూ, ప్రభుత్వాధికారులను, మార్కెట్ నియంత్రణా సంస్ధలనూ, ప్రభుత్వాలనూ వణికిస్తూ కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
అమెరికా రుణ సంక్షోభం వలన డాలర్ విలువ కూడా పతనమవుతోంది. మదుపుదారులు సురక్షిత స్ధావరం కోసం ప్రయత్నిస్తూ బంగారం ని తెగ కొనేస్తున్నారు. దానితో డాలర్ ధర దిగజారుతుండగా, బంగారం ధర పైకి ఎగబాకుతోంది. అంటే కాగితం డబ్బు తరిగి పోతుండగా, బంగారాన్ని మళ్ళీ అంతర్జాతీయ ప్రామాణిక కరెన్సీగా చేయాలన్న వాదనలకు ప్రాణం వస్తోంది. “Leave the fire ashes, what remains is gold” అన్న ప్రఖ్యాత రచయిత, కవి రాబర్ట్ బ్రౌనింగ్ వాక్కులను నిజం చేస్తున్న ఈనాటి పరిస్ధితికి గీతల రూపం ఈ కార్టూన్.
DOLLAR LOSES TO GOLD as a result of the US debt crisis
రుణ సంక్షోభంలో తగలబడుతున్న డాలర్లు, మెరిసిపోతున్న బంగారం
–
కార్టూనిస్టు: బేటప్, అడిలైడ్, ఆస్ట్రేలియా
–
