లిబియా తిరుగుబాటుదారుల్లో వెల్లివిరుస్తున్న ఐకమత్యం -కార్టూన్


అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్‌ లో పాల్గొంటున్న కమేండర్‌ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని కాల్చి చంపింది. ఆ ఘటనకు తిరుగుబాటు ప్రభుత్వం ఇంకా వివరణ ఇవ్వడంతో శక్తివంతమైన ఆయన తెగవారు న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవలసి ఉంటుందని యోనెస్ కుటుంబం హెచ్చరించింది. ఆల్-ఖైదా గ్రూపు ఈ హత్య వెనుక ఉందని లిబియా ప్రభుత్వం చెబుతోంది. యోనెస్ హత్యతొ లిబియా తిరుగుబాటుదారుల విశ్వసనీయతపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులకు అనుమానాలు తలెత్తాయి. తిరుగుబాటుదారుల్లో తలెత్తిన లుకలుకలు క్రింది వార్తల్లో చదవవచ్చు.

Unity of Libyan Rebels

లిబియా తిరుగుబాటుదారుల ఐకమత్యం

కార్టూనిస్టు: విక్టర్ నీటొ, వెనిజులా, Rebelion

వ్యాఖ్యానించండి