అమెరికా రుణ పరిమితిని $2.1 పెంచడానికీ, బడ్జెట్ లోటు $2.1 ట్రిలియన్ తగ్గించడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు కుదుర్చుకున్న ఒప్పందం సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు తాత్కాలికంగా మాట్లు వేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దానివలన రాదు. అమెరికా ప్రజల మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, బడా కంపెనీల దోపిడి, వేతనాల స్తంభన… మొదలైన సమస్యలను పరిష్కరించకుండా,ఆర్ధిక వ్యవస్ధలొని వివిధ ప్రధాన అంగాల్లో తాత్కాలికంగా మాట్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించడం అవివేకం. అది ప్రజలను వంచించడంతో సమానం. భారత దేశ జాతీయ పత్రిక “ది హిందూ” అందించిన ఈ కార్టూన్:
ఒబామా: ప్రస్తుతానికి బిగించేశా…
–
