అంతర్జాతీయ న్యాయస్ధానం నిర్ణయాన్ని తిరస్కరించిన లెబనాన్ హిజ్బొల్లా

లెబనాన్ మాజీ ప్రధాని రఫిక్ హరిరి హత్య కేసులో నలుగురు హిజ్బొల్లా నాయకులపై కోర్టు విచారణ జరగడానికి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐ.సి.సి) ఆమోదించడాన్ని హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా తిరస్కరించాడు. రఫిక్ హరీరి 2005లో బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు. “గౌరవనీయులైన సోదరులను” ప్రపంచంలో ఏ శక్తీ అరెస్టు చేయలేదని నజ్రల్లా స్పష్టం చేశాడు. ఐ.సి.సి ట్రిబ్యునల్ విచారణకు నిర్ణయించిన నలుగురిని 30 రోజుల్లోగా అప్పగించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి నియమించిన “లెబనాన్ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్”…

సరైన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటుకు పంపండి, సోనియాను కోరిన హజారే బృందం

శనివారం లోక్‌పాల్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపధ్యంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాందీని కలిశారు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రి, ఛీఫ్ జస్టిస్ లను కూడా తేవాలని సోనియా గాంధీని గట్టిగా కోరామని సమావేశం అనంతరం అన్నా హజారె విలేఖరులకు తెలిపాడు. సోనియా గాంధీతో 30 నిమిషాలు సమావేశమైన హజారే బృందం సరైన బిల్లు పార్లమెంటు ముందుకు వెళ్ళేలా చూడాలనీ, ఆ తర్వాత పార్లమెంటు ఏ విధమైన…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా,…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి బ్రిటిష్ అధికారుల రహస్య ప్రయత్నాలు

బహుళజాతి కంపెనీలు, వారితో కుమ్మక్కైన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడానికి, వారికి సరైన సమాచారం అందకుండా చుడ్డానికి ఎంతకైనా తెగిస్తారు. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు లేదా బ్రిటన్ కావచ్చు. ప్రజల భవిష్యత్తు నాశనమైపోయినా సరే వారికి మాత్రం లాభాలు నిరంతరాయంగా వస్తూ ఉండవలసిందే. ఫుకుషిమా దైచి అణు ప్రమాదం వలన కొత్తగా నెలకొల్పే న్యూక్లియర్ కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తారని భయపడిన బ్రిటిష్ అధీకారులు ఆ ప్రమాదం వలన ఏర్పడపోయే ప్రతికూల పరిణామాలను తక్కువ చేసి…

టెర్మినేటర్ హీరో ష్వార్జ్‌నెగ్గర్ అక్రమ సంబంధం, విడాకులు కోరిన భార్య

ప్రిడేటర్, టెర్మినేటర్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకోవడమే కాక ఆ పలుకుబడితో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా కూడా ఎన్నికయిన హాలీవుడ్ ఏక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ నుండి విడాకులు కోరుతూ అతని భార్య మేరియా ష్రివర్ కోర్టు మెట్లు ఎక్కింది. రోబోట్ పాత్రలో టైం మిషన్‌ సాయంతో కాలంలో వెనక్కి ప్రయాణించి భూమిని యంత్రాల నుండి కాపాడ్డానికి ప్రయత్నించిన టెర్మినేటర్ హీరో అక్రమ సంబంధం వలన తన వైవాహిక జీవితాన్ని సైతం టెర్మినేట్ చేసుకోనున్నాడు. తన ఇంటిలో పనిచేసే…

అదంతా నా సోదరిపై దుష్ప్రచారం -స్ట్రాస్ కాన్ బాధిత మహిళ సోదరుడు

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్‌పై రేప్ ఆరోపణలు చేసిన మహిళ డ్రగ్స్ ముఠాలతోనూ, మనీ లాండరింగ్ ముఠాలతోనూ సంబంధాలున్నాయని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు కనుగొన్నట్లుగా వచ్చిన వార్తలను ఆమె సోదరుడు తీవ్రంగా ఖండించాడు. అదంతా తన సోదరిపై జరుగుతున్న దుష్ప్రచారమేననీ, ఆమెపై లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ రెలిపింది. ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాలకు తన సోదరిని బలి చేస్తున్నారని వాపోయాడు. “నా సోదరిని అపఖ్యాతిపాలు చేయడానికి కనిపెట్టిన…

రేప్ కాదు… పరస్పర అంగీకారమే, అనూహ్య మలుపు తిరిగిన స్ట్రాస్ కాన్ కేసు

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ కేదు అనూహ్య మలుపు తిరిగింది. జరిగింది రేప్ కాదనీ, పరస్పర అంగీకారంతోనే జరిగిందనీ తాజా వివరాలను బట్టి అర్ధమవుతున్నదని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళ, తన వ్యక్తిగత వివరాల గురించి పదే పదే అబద్ధాలు చెబుతుండడంతో ఆమె విశ్వసనీయతపై ప్రాసిక్యూటర్లు నమ్మకం కోల్పోయారని రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, బిబిసి వార్తా సంస్ధలు తెలిపాయి. ఫలితంగా స్ట్రాస్ కాన్‌పై నమోదు చేసిన కేసు తేలిపోయే అవకాశాలున్నాయని…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

మరింత క్షీణించిన భారత మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి

ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి జూన్ నెలలో కూడా క్షీణించడం కొనసాగింది. జూన్ నెలలో మాన్యుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తొమ్మిద నెలల కనిష్టస్ధాయిలో నమోదైందని పి.ఎమ్.ఐ సర్వేలో తేలింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుండడం వలన అప్పు సేకరణ ఖరీదు పెరగడంతో దాని ప్రభావం మాన్యుఫాక్చరింగ్ రంగంపై పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు నిర్వహించే పి.ఎమ్.ఐ సూచిక (Purchasing Managers’ Index) ప్రకారం మే నెలలో పి.ఎమ్.ఐ సూచి 57.5 నమోదు చేయగా జూన్ నెలలో అది…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసిన ఫ్రాన్సు, రష్యా నిరసన

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను హెలికాప్టర్ల ద్వారా జారవిడిచినట్లుగా ఫ్రాన్సు సైన్యాధికారులు తెలిపారు. బెర్బెర్ తెగల ఫైటర్లకు లిబియా రాజధాని ట్రిపోలికి నైరుతి మూల ఉన్న కొండల్లో ఆయుధాలను జారవిడిచినట్లు ఫ్రాన్సు మిలట్రీ తెలిపింది. ఏప్రిల్ చివరినుండి జూన్ ప్రారంభంవరకూ తిరుగుబాటుదారులకు ఈ విధంగా ఆయుధాలను అందించామని వారు తెలిపారు. ఐతే ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం లిబియా యుద్ధంలో ఉన్న ఇరుపక్షాలకు ఆయుధాలు అందించడాన్ని నిషేధించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల అధికారులే స్వయంగా లిబియాలోని ఇరు…