పాలక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం అపారం. ఏ బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో, ఏ ఆందోళననను ఎలా తప్పించుకోవాలో, ఏ సంకటం నుండి ఎలా బైటపడాలో కాంగ్రెస్ పాలకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు.
సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారాయి. ఓవైపు తాము నిండా మునిగి ఉన్న కుంభకోణాలకు సమాధానం చెప్పుకోవలసి ఉండగా, మరొక వైపు అంతర్జాతీయ పెట్టుబడుదారులనుండీ, పశ్చిమ దేశాల నుండీ, వారి బహుళజాతి కంపెనీల నుండి ఎదురవుతున్న ఒత్తిడి మేరకు మరిన్ని సరళీకృత ఆర్ధిక విధానాల అమలుకి అవసరమైన బిల్లుల్ని అమోదింపజేసుకోవలసి ఉంది.
2జి కుంభకోణం, కామన్‌వెల్స్ గేమ్స్ కుంభకోణం, అక్రమ మైనింగ్ కుంభకోణం, లోక్‌పాల్ బిల్లు, తెలంగాణ రాష్ట్రం తదితర అంశాలు పాలక పక్షానికి పార్లమెంటు సమావేశాల్లొ ముచ్చెమటలు పట్టించనున్నాయి. ఈ అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా 2జి కుంభకోణం పైనే ప్రతిపక్షాల దృష్టి కేంద్రీకృతం అయి ఉంది. కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు నేరుగా సంబంధం ఉన్న కుంభకోణం అది.
తెలంగాణ డిమాండ్ కోసం కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేశారు. వివిధ బిల్లులపై ఓటింగ్ దాకా వ్యవహారం వస్తే కాంగ్రెస్‌కి నష్టకరంగా ఈ రాజీనామాలు పనిచేస్తాయి. కావున వీరు రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం సహజం. అందువలన కాంగ్రెస్ ఎం.పి ల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ తిరస్కరించడం ఖాయం. అయితే కాంగ్రెస్ ఎం.పిల రాజీనామాల తిరస్కరణలో కూడా కాంగ్రెస్ పార్టీ, కొన్ని ప్రయోజనాలను ఆశిస్తుండడమే అసలు విషయం.
తెలంగాణ ఎం.పిల రాజీనామానా తిరస్కరణ కాంగ్రెస్ ఎం.పిలకు ఆగ్రహం తెప్పిస్తుంది. వాస్తవానికి తమ హైకమాండ్ పై ఆగ్రహం తెచ్చుకునే పనికి కాంగ్రెస్ ఎం.పిలు పూనుకునే అవకాశాలు ఎట్టిపరిస్ధితుల్లోనూ తలెత్తదు. అయినా ఈ సారి మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలు హైకమాండ్ పైన తీవ్ర ఆగ్రహం ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడో బైట మైకుల ముందు కాకుండా ఏకంగా పార్లమెంటులోనె కాంగ్రెస్ ఎం.పిల ఆగ్రహ ప్రకటన, ఆందోళనలు చోటు చేసుకోనున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలు తమ రాజీనామాలను తిరస్కరించినందుకు స్పీకర్ పై ఆగ్రహంతో విరుచుకుపడడం ద్వారా ప్రతిపక్షాలు 2జి కుంభకోణంపై చేసే ఆందోళనను పూర్వపక్షం చేయడానికి కాంగ్రెస్ వ్యూహ కర్తలు పధకం పన్నారు. 2జి కుంభకోణం ప్రధాని, అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం ల అనుమతి లేకుండా జరిగే అవకాశాలు లేవని మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మాజీ టెలికం కార్యదర్శిలు సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో వాదించిన సంగతి తెలిసిందే. వారి వాదనలపై ఆధారపడి ప్రధాని, హోం మంత్రిల రాజీనామాలను డిమాండ్ చేస్తూ బి.జి.పి తదితర ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున సభలో ఆందోళన చేస్తాయి. అది అనివార్యం. ప్రతిపక్షాల నుండి ఎదురయ్యే ఈ ఒత్తిడిని తెలంగాణ ఆందోళన ద్వారా తిప్పికొట్టాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ ఇటీవల నియమితుడయ్యాడు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలకు ఈ విషయమై నిర్ధిష్ట సూచనలు ఇచ్చినట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. ప్రతిపక్షాలు 2జి కుంభకోణంపై రాద్ధాంతం చేసే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలు తమ రాజీనామాల తిరస్కరణపై పెద్ద ఎత్తున అరిచి గోల చెయ్యాలి. ఆందోళన చెయ్యాలి. వీరెంత ఆందోళన చేసిన బహుశా మార్షల్స్ వీరిజోలికి రాక పోవచ్చు. అపుడు లోక్ సభలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా 2జి ఆందోళనకు స్పందించకుండా తెలంగాణ ఆందోళనకు స్పందించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విధంగా 2జి, లోక్ పాల్, కామన్ వెల్త్ తదితర కుంభకోణాలపై నేరుగా సమాధానం చెప్పె బాధ్యతనుండి తప్పించుకోవచ్చు.
ఈ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

HI
అంతా బావుంది బాసు మనం ప్రతి 5 సంవత్సరాలకు Elections పెట్టి బొలెడు కోట్లు ఖర్చు పెట్టి MLA లను MP లను ఎన్నుకుంటాం కదా.
మరి తెలంగాణ విషయం లొ కూడ ఓటింగ్ పెట్టమని అదగొచ్చుగ మీరు (మేము కూడ). అది మానెసి బందు లంటాం రాస్తా రోకోలు అంటం సకలజన సమ్మెలంటం రైల్ రోకోలు అంటం బస్సు రొకొలు అంటం మన ఆస్తులను మనమే తగలబెట్టుకుంటాం. ఆత్మ హత్యలు చేసుకుంటాం.
దరిద్రపు వెధవలు అందరూ కలిసి సమైక్యంద్ర AND తెలంగాణ ఉద్యమాల్లొ ఉన్నవారు ఒక్కడు logical గ ఆలొచించడు.
ఏమొ వాళ్ళకు ఏమైన స్వప్రయోజనాలు ఉన్నయేమో తెలియదు బాసు. తెలంగాణా ఇవ్వాలొ వద్దొ Election పెట్టమను.
తెలంగాణ ఒక్కదాంట్లోనే Election పెడితే 80% మంది తెలంగాణ కావలంటే ఇచ్చెయ్యమని అందరు పొరాడదాం.
మొత్తం అంద్రప్రదేశ్ లొ అయితె 60% ఒప్పుకుంటె తెలంగాణ ఇవ్వమని పొరాడదాం. అంతేకాని మన ఆస్తులను మనమే పాడు చేసుకోవడమో లేక మన సోదరులను (సీమాంధ్ర OR తెలంగాణ) మనమే కొట్టుకోవడమో మూర్ఖత్వం లా లెదూ.
ఇంక 80% మీద నీకు doubt రావొచ్చు. కాని అది correct ఎందుకంటే మల్లి మార్చుకొలేని నిర్ణయం కాబట్టి. అందరూ బాసు ఇకనైనా లొగిచల్ గ ఆలోచిద్దాం.
(ఈ కామెంట్లో స్పెల్లింగ్ తప్పులను కరెక్టు చేశాను, వ్యాఖ్యాతకు అభ్యంతరం ఉండదన్న అంచనాతో -విశేఖర్)