లిబియా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడి హత్య, బ్రిటన్‌లో అంతర్మధనం?!


Last journey of Abdul Fattah Younes

బెంఘాజీలో లిబియా తిరుగుబాటు కమాండర్ 'అబ్దుల్ ఫతా యూనెస్' అంతిమయాత్ర

లిబియాలో తిరుగుబాటు ఆరంభం ఐనప్పటి ప్రారంభ దశలోనే తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయి వారితో కలిసి గడ్డాఫీ బలగాలపై పోరాటం చేస్తున్న అత్యున్నత మిలట్రీ అధికారి జనరల్ అబ్దుల్ ఫతా యూనెస్, దారుణంగా హత్యకు గురికావడం లిబియాతో పాటు లిబియా తిరుగుబాటుకి మద్దతు తెలిపిన బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు కూడా కలవరపాటుకి గురిచేసింది. ఆయిల్ పట్టణం బ్రెగా వద్ద ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న అబ్దుల్ ఫతాను గురువారం తిరుగుబాటుదారుల రాజధాని బెంఘాజికి వెనక్కి పిలిపించిన తర్వాత అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. హత్య చేయడానికి పిలిపించారా అన్నదీ ఇంకా తేలలేదు. తిరుగుబాటుదారుల్లో ఉన్న అంతర్గత వైషమ్యాల ఫలితంగానే ఈ హత్య జరిగిందని చాలా మంది భావిస్తున్నారు.

యూనెస్ హత్య ద్వారా బ్రిటన్ ఎంత పెద్ద తప్పు చేసిందీ రుజువైందని లిబియా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. తిరుగుబాటుదారులు, బెంఘాజీలో నెలకొల్పిన నేషనల్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ని (ఎన్.టి.సి) ప్రారంభంలో ఫ్రాన్సు గుర్తించగా, బ్రిటన్ ఫ్రాన్సును అనుసరించింది. ఆ తర్వాత అవి చాలా కాలం పాటు యూరప్ దేశాల గుర్తింపుకోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎన్.టి.సి మాత్రమే లిబియాకు ఏకైక ప్రతినిధి అని బ్రిటన్ గుర్తించి పెద్ద తప్పు చేసిందని, అబ్దుల్ ఫతా యూనెస్ హత్యతో తిరుగుబాటుదారులు లిబియాని పాలించడానికి అర్హులు కారని రుజువయ్యిందని లిబియా ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

అబ్దుల్ ఫతా యూనెస్‌ను తిరుగుబాటుదారులలోని వారే హత్య చేయడం బ్రిటన్ మొఖం మీద చాచికొట్టిన చెంబదెబ్బ అని గడ్డాఫీ ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యానించాడు. యూనెస్ లిబియా ప్రభుత్వంలో అంతర్గత శాఖ (హోం) మంత్రిగా పని చేసేవాడు. గడ్డాఫీని అధ్యక్షుడిని చేసిన కుట్రలో అతనూ భాగస్వామ్యుడు. పదవికి రాజీనామా చేసి, తిరుగుబాటు అని చెబుతూ ప్రారంభమైన ఘర్షణలోకి ఈయన ఆదిలోనే చేరిపోయాడు. ఈయన హత్య వెనుక ఎవరున్నదీ ఇంకా తెలియలేదని తిరుగుబాటు ప్రభుత్వం, బ్రిటన్, ఫ్రాన్సు చెబుతున్నాయి. మిస్టరీ గా మారిందని చెబుతున్నాయి. కానీ హత్య చేసినవాడిని అరెస్టు చేశామని తిరుగుబాటు ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అది నిజమా కాదా అన్నది తెలియలేదు.

కమాండర్ యూనెస్ తో పాటు అతని ఇద్దరు బాడీగార్డులను కాల్చి చంపారని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. తిరుగుబాటుదారుల్లో శక్తివంతమైన ఆల్-ఖైదా గ్రూపే ఈ హత్యకి కారణమని లిబియా ప్రభుత్వం చెబుతున్నది. “బ్రిటిష్ వారు గుర్తించిన కౌన్సిల్ తన సొంత కమాండర్‌నే కాపాడుకోలేకపోవడం అంటే అది, బ్రిటిష్ మొఖం మీద లెంపకాయను చాచికొట్టినట్లే” అని లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం అభివర్ణించాడు.

“ఈ చర్య ద్వారా ఆల్-ఖైదా ఈ ప్రాంతంలో తన ఉనికిని రుజువు చేసుకోవాలని కోరుతోంది. టి.ఎన్.సి లోని ఇతర సభ్యులకు హత్య వివరాలు తెలిసినా ప్రతిస్పందించలేక పోతున్నారు. ఎందుకంటే వారు ఆల్-ఖైదాకు తీవ్రంగా భయపడుతున్నారు.

వ్యాఖ్యానించండి