స్టార్ ఛానెళ్ల అధినేత, “న్యూస్ ఆఫ్ ది వరల్డ్”, “ది సన్” లాంటి టాబ్లాయిడ్ పత్రికలతో బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ సాధించిన మీడీయా రారాజు రూపర్డ్ మర్డోక్ ఇప్పుడు ఆ మీడియాతోనే ఇబ్బందిపడిపోతున్నాడు. పత్రికకు అగ్ర స్ధానం సంపాదించడానికీ, ఆ తర్వాత అగ్ర స్ధానన్ని నిలబెట్టుకోడానికి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన రూపర్డ్ మర్డోక్ తాను కూడా అందుకు అతీతుడను కానని అర్ధమై, తన ముఖం ఎలాంటిదో అద్దంలో ప్రతిబింబుస్తుండడంతో అసహనానికి లోనవుతున్నాడు.
హత్యకు గురైన బాలిక సెల్ ఫోన్ దగ్గర్నుండి, 9/11 దాడులకు బలైన వారి సెల్ ఫోన్లతో పాటు, ఆఫ్ఘనిస్ధాన్‌లో మరణించిన బ్రిటిష్ సైనికుల సెల్ ఫోన్లను కూడా హ్యాకింగ్ చేసి దొంగిలించిన సమాచారాన్నే పెట్టుబడిగా తన వార్తా పత్రికలకు అగ్ర స్ధానం సాధించుకున్నాడు రూపర్డ్ మర్డోక్. కిందివారు చేసినపని అని చెబుతున్న మర్డోక్ దానిని ఆపడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదన్నదానికి సమాధానం చెప్పలేక పోతున్నాడు. తన అనైతిక కార్యకలాపాలపై శరపరంపరగా ప్రశ్నలను సంధిస్తున్న విలేఖరుల పట్ల మర్డోక్ అసహనం ఈ కార్టూన్‌లో:
ప్రెస్‌ని అర్ధం కాని భాషలో ఆడిపోసుకుంటున్న రూపర్ట్ మర్డోఖ్. పక్కనే ‘న్యూస్ ఇంటర్నేషనల్’ మాజీ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్
కార్టూనిస్టు: MOIR, మోర్నింగ్ హెరాల్డ్, సిడ్నీ, ఆస్ట్రేలియా
–