బళ్లారి ఇనుప ఖనిజ తవ్వకాలతో పర్యావరణ హాని, తవ్వకాలను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు


ఇనుప ఖనిజాన్ని విచక్షణా రహితంగా తవ్వి తీస్తుండడం వలన పర్యావరణానికి తీవ్ర హాని సంభవిస్తున్నదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక సపర్పించడంతో బళ్లారిలో ఇనుప ఖనిజ తవ్వకాలను సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. “తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను నిలిపివేయాలని ఈ కోర్టు భావిస్తునది” అని ఛీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

దేశంలోని ఉక్కు పరిశ్రమ అవసరాలు తీర్చడానికి ఎంత ఖనిజం కావలసిందీ తెలుపుతూ పర్యావరణం, అటవులు శాఖ మధ్యంతర నివేదికను తయారు చేస్తుందని కోర్టు తెలిపింది. దేశీయ పరిశ్రమలకు ఎంత ఉక్కు అవసరం, మరెంత ఉక్కుని దిగుమతి చేసుకోవాలి అన్న అంశాలను కూడా పర్యావరణం, అడవుల శాఖ తెలియజేస్తుందని కోర్టు ఆదేశించింది. ఖనిజాలు, ఉక్కు, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో సంప్రతింపులు జరిపి పర్యావరణం అడవుల శాఖ ఒక నివేదిక సమర్పిస్తుందని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి చేసిన సూచనను సుప్రీం కొర్టు అంగీకరిస్తూ ఈ ఆదేశాలను జారీ చేసింది.

జాతియ సాధికారిక కమిటీ తాజాగా సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. “అక్రమ మైనింగ్ తీవ్రంగా కొనసాగుతుండడంతో పాటు దానివలన పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని సాధికారిక కమిటీ తెలియజేయడంతో సుప్రీం ప్రత్యేక కోర్టు ఈ చర్యలు తీసుకుంది.

వ్యాఖ్యానించండి