భారత పర్యటనలో పాక్ యువ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని -ఫోటోలు


ముంబై టెర్రరిస్టు దాడుల వలన ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య మూడేళ్ళ క్రితం నిలిచిపోయిన శాంతి చర్చలు గత కొద్ది నెలలుగా కొంత కదలికలోకి వచ్చాయి. కొద్ది వారాల క్రితం భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ పర్యటించి ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చలకు ప్రాతిపదిక తయారు చేసి వచ్చారు. ఆ తర్వాత నిరుపమా రావు నుండి పాక్ ప్రభుత్వం స్ఫూర్తి పొందిందో ఏమో తెలియదు గాని యువ రాజకీయ నాయకురాలు ‘హైనా రబ్బాని ఖర్’ ను విదేశాంగ మంత్రిగా పాక్ ప్రభుత్వం నియమించుకుంది.

నూతనంగా భాద్యతలు స్వీకరించినప్పటికీ, అత్యంత క్లిష్టమైన భారత్ పర్యటన ఐనప్పటికీ హైనా, ఎక్కడా తడబాటు పడకుండా పర్యటన ముగించగలిగింది. భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఎంతో సీనియర్ నాయకులు అయినప్పటికీ తడబాటు లేకుండా వ్యవహరించి మీడియాని ఆకర్షించగలిగింది. భారత్, పాక్ లు మాట్లాడుకుంటూ ఉండడమే ఒక విధమైన శాంతి ఉన్నట్లు అన్న ఆమె వ్యాఖ్యానంలో నిజం ఉంది. ముంబై టెర్రరిస్టు దాడుల దోషులపై విచారణ త్వరగా పూర్తి చేయడం పాకిస్ధాన్ ప్రయోజనాలకే మంచిదని వ్యాఖ్యానించింది. ఆమె పర్యటనకి సంబంధించిన ఫోటోలు యాహూ న్యూస్ ప్రచురించింది. అవి ఇక్కడ:

3 thoughts on “భారత పర్యటనలో పాక్ యువ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని -ఫోటోలు

  1. హాయ్ రబ్బా! హాయ్ హాయ్ రబ్బాని! :)

    (స్త్రీలను అవమానిస్తూ రాసిన ఈ అసభ్య కామెంట్‌ను తోలగిస్తున్నాను -విశేఖర్)

  2. మిత్రమా,
    చాలా ఓపికగా రోజు ఇన్నిటపాలు, అది విదేశాలలో జరిగె విషయాలపై రాస్తూంటే మీగురించి తెలుసుకోవాలని ఉంది. ఇంత సమాచారం ఎక్కడనుండి సంగ్రహిస్తున్నారు? ఎమీ చదివారు? ఎక్కడ(యునివర్సిటి), ఎప్పుడు చదివారు? మీరు జర్నలిస్ట్? లేక బ్లాగు రాయటం హాబియా?

  3. శ్రీనివాస్ గారూ

    నేను రాస్తున్నది ఏమంత పెద్ద సమాచారం కాదు. వార్తా సంస్ధలు అందిస్తున్న వార్తలే నాకూ వనరు. విశ్లేషణ వరకు నాది. అది నా ప్రాపంచిక దృక్పధానికి సంబంధించినది. జర్నలిస్టును కాదు గానీ వాళ్ళు చేసే కొన్ని పనులు చేస్తుంటాను. నా బ్లాగింగ్, హాబీకి ఎక్కువ, వృత్తికి తక్కువ. చరిత్ర, సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీ, తత్వశాస్త్రం తదితర పుస్తకాలు చాలా నా దగ్గర ఉన్నాయి. అవి చదువుతుంటాను. ఈ వివరాలు నేను ఇంతకు ముందు ఇచ్చాను. మీ ఎంక్వైరీ మేరకి మళ్ళీ ఇస్తున్నాను.

    ఇదే ప్రశ్న, ఇదే పేరుతో గతంలో ఒక అధముడు వేశాడు. అతను మీరు కాదన్న అంచనాతో ఈ సమాధానం ఇస్తున్నా.

వ్యాఖ్యానించండి