ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్


వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని చెప్పుకోవడానికి తాలిబాన్‌తో చర్చలని నాటకాలు షురూ అయ్యాయి. తాలిబాన్ మాత్రం తమ లక్ష్యం నుండి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదని వారి ప్రకటనలు, చర్యలు చెబుతున్నాయి.

Afghan departure

బారక్ ఒబామా: సరే, అయితే. మేం వెళ్ళిపోతున్నాం.

తాలిబాన్: కర్తవ్యం పూర్తయ్యింది!

కార్టూనిస్టు: క్లెమెంట్, టొరంటో, కెనడా (నేషనల్ పోస్ట్)

 

వ్యాఖ్యానించండి