నార్వే బాంబు పేలుళ్ళ నిందితుడికి నచ్చిన కొటేషన్


ఓ నమ్మకం కలిగిన ఒక వ్యక్తి, కేవలం ప్రయోజనాలు మాత్రమే కలిగి ఉన్న లక్షమంది బలగంతో సమానం -ఇంగ్లీష్ తత్వవేత్త జాన్ స్టువర్డ్ మిల్.

One person with a belief is equal to the force of 100,000 who have only interests. -English Philosopher John Stuart Mill.

నార్వే రాజధాని ఓస్లోలో బాంబు పేలుళ్లకు పాల్పడి 7 గురినీ, సమీపంలోని ఉటావో ద్వీపంలో విచక్షణా రహిత కాల్పులకు పాల్పడి 84 మందినీ చంపిన “ఏండర్స్ బేరింగ్ బ్రీవిక్” కి నచ్చిన కొటేషన్ ఇది. జులై 17 న తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఈ కొటేషన్‌ను రాసుకున్నాడని వార్తా సంస్ధలు తెలుపుతున్నాయి.

బ్రీవిక్ గతాన్ని విచారించిన పోలీసులకి ఆశ్చర్యం కలుగుతోందని చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో అతని రాతలను బట్టి క్రిస్టియన్ మితవాద భావాలు ఉన్నవాడని భావిస్తున్న పోలీసులకు ఎటువంటి మితవాద తీవ్రవాద సంస్ధతోనూ అతనికి సంబంధాలు లేకపోవడం మిస్టరీగా తోస్తోంది. రెండు వారాల క్రితం కృత్రిమ ఎరువును ఆరు టన్నుల మేర కొనుగోలు చేశాడని అతనికి ఆ ఎరువును అమ్మిన దుకాణదారు పోలీసులకు తెలిపాడు. సదరు కృత్రిమ ఎరువును పేలుడు పదార్ధాల్లో వినియోగిస్తారట.

బ్రీవిక్‌కి తుపాకి లైసెన్సులు చాలానే ఉన్నాయి. ఒక గన్ క్లబ్‌లో సభ్యుడు కూడా. 84 మందిని చంపాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? ఎన్ని తుపాకుల్ని తెచ్చి ఉండాలి? లేదా ఎన్ని సార్లు రీ లోడింగ్ చేసి ఉండాలి, అంతమందిని చంపాలంటే? అతనొక్కడే కాదు. మరొక వ్యక్తి కూడా ఉన్నాడని సాక్ష్యులు చెబుతుండడంతో రెండో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

3 thoughts on “నార్వే బాంబు పేలుళ్ళ నిందితుడికి నచ్చిన కొటేషన్

  1. నార్వే ప్రపంచశాంతిని కోరుకునే మొదటి దేశంగా నాకు తెలుసు, అందుకు తనవంతు ప్రయత్నాలని చేయటం (శ్రీలంక మరికొన్ని దేశాల శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం) ద్వారా ఆశయాల్ని ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేసింది. ఇప్పుడు ఆ దేశంలోనే ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టం.

  2. ప్రపంచ శాంతిని కోరే నార్వే అమెరికా అబద్ధాలకు వంతపాడుతూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాన్ లపై దురాక్రమణల యుద్ధాలకి తన సైన్యాన్ని కూడా పంపింది. నార్వె జరిపే శాంతి చర్చలు అమెరికా, యూరప్ ల ఆధిపత్య ప్రయోజనాలను కాపాడేందుకే తప్ప నిజంగా శాంతి స్ధాపనపై మమకారం దానికేమీ ఉండదు. నార్వేలో కూడా తీవ్రవాద సంస్ధలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాజీ భావాలున్నవి కూడా ఉన్నాయి. క్రిస్టియన్ రైటిస్టు గ్రూపులు అక్కడ ప్రధాన తీవ్రవాద సంస్ధలుగా ఉన్నాయి. ముస్లిం వ్యతిరేకతే వీరికి ప్రాణవాయువు.

    నోబెల్ బహుమతులన్నీ డెన్మార్క్, స్వీడన్‌లు ఇస్తే ఒక్క నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వే ఇస్తుంది. 2009లో ఒబామా అధ్యక్షభవనంలోకి చేరిన 11 రోజులకే ‘నోబెల్ శాంతి బహుమతి’ ప్రకటించింది నార్వే. ఇది ప్రపంచాన్ని నిశ్చేష్టపరిచింది. శాంతి బహుమతి పకటించాక అన్ని వైపులనుండీ ప్రశంసలూ, యోగ్యతా పత్రాలూ మొ.వి ఇస్తూ ప్రకటనలు వెల్లువెత్తుతాయి సాధారణంగా. కాని ఒబామాకి ప్రకటించాక మౌనం రాజ్యమేలింది. అసలు ఒబామా కూడా తనకు నోబెల్ బహుమతి రావడం పట్ల ఇబ్బంది పడినట్లు కనిపించాడు. బహుమతి వచ్చాక దానికి అనుగుణంగా ప్రశంసలు కురిపిస్తూ, ఫలానా చేశాడు గనక వచ్చింది. అందువలన సరైందే, అని విశ్లేషణ చేస్తూ ప్రకటనలు ఇస్తుంటారు. కాని ఒబామా అధికారంలోకి వచ్చే పదకొండు రోజులవుతోంది. ఇక శాంతి కోసమో, హింస కోసమో కృషి ఎప్పుడు చేసి ఉంటాడు, శాంతి బహుమతి ప్రకటించడానికి? నార్వే దేశం శాంతి కాముకత అలా తగలడింది మరి.

    ఇంతకీ నోబెల్ బహుమతి స్వీకరించేనాటికి ఒబామా ఆఫ్ఘనిస్ధాన్‌కి మరో 33,000 మంది సైనికుల్ని పంపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ‘శాంతి బహుమతి ప్రకటించారు కదా, అది తీసుకున్నాక సైన్యం పెంపు ప్రకటిద్దామ’న్న మొహమాటం కూడా ఒబామా పడలేదు. శాంతి బహుమతి స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో “శాంతి స్ధాపన కోసం యుద్ధాలు చేయడం అనివార్యం” అని ప్రకటించి మరీ బహుమతిని అంగీకరించిన కొంటె కృష్ణుడు ఈ ఒబామా. ఆ కొంటె కృష్ణుడిని ఆరాధించే వేల గోపికల్లో ఒకరు నార్వే పాలక వర్గం.

    అదీ నార్వే కధ!

వ్యాఖ్యానించండి