4.8 మిలియన్ల జనాభా ఉన్న నార్వే శుక్రవారం బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులతో అట్టుడికింది. రాజధాని ఓస్లో నగరంలో ప్రధాన మంత్రి కార్యాలయం సమీపంలో బాంబులు పేలి 7 గురు చనిపోయారు. బాంబు పేలుళ్ళకు కారణమైన వ్యక్తే సమీపంలోని ఉటావో ద్వీపంలో సభ జరుపుకుంటున్న పాలక పార్టీ యువజన సంఘం స్ధలం వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 84 మందికి పైగా టీనేజి యువతీ యువకుల్ని చంపాడు. ఓస్లోలో బాంబు పేలుడు శక్తిని బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఉటావో ద్వీపంలో కూడా చాలా మంది నీళ్ళలోకి దూకి ప్రధాన భూభాగం చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా వారిపై కూడా ఉన్మాది కాల్పులు జరిపాడని కనుక అక్కడ కూడా మృతుల సంఖ్య పెరగవచ్చనీ పోలీసులు చెబుతున్నారు.
- ఓస్లో బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు ఏండర్స్ బేరింగ్ బ్రీవిక్, వయసు 32
నిందితుడి ఫేస్ బుక్ ఖాతా ద్వారా, మిత్రుల ద్వారా నిందితుడు బ్రీవిక్ రెండు మూడేళ్ళనుండి మితవాద క్రిస్టియన్ రాజకీయ భావాలకు ఆకర్షితుడయ్యాడని తెలుస్తోంది. మితవాద తీవ్రవాద భావాలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పౌరులను బలిగొన్న సంఘటనలు గతంలోనూ పశ్చిమ దేశాల్లొ జరిగాయి. బహుళ సంస్కృతి జీవనాన్ని వ్యతిరేకించే వీరు వలస వచ్చి స్ధిరపడేవారిపై ఆగ్రహం పెంచుకోవడం కద్దు.
పాలక లేబర్ పార్టీ యువజన సంఘం ఉటావోలొ సమ్మర్ కేంప్ నిర్వహిస్తుండగా నిందితుడు కాల్పులు జరిపాడు. పోలీసు డ్రస్సులో రావడంతో విధుల నిర్వహిస్తున్నాడని భావిస్తుండగానే అకస్మాత్తుగా కాల్పులకు దిగాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.











మీకు చాల ఓపిక అండి. Though i may not agree with some of your analysis, i appreciate your efforts to write the news as well as your opinion in detail.
ధన్యవాదాలు సంజయ్ గారు. నా విశ్లేషణలో తప్పుందని మీకు తోస్తే తెలియజేయండి. నిజమే అని భావిస్తే సవరించుకుంటాను. కాదంటే చర్చిస్తాను.