నార్వే రాజధాని ఓస్లోను బాంబు పేలుళ్ళు కుదిపేశాయి. గంట నుండి రెండు గంటల వ్యవధిలో వరుసగా జరిగిన రెండు సంఘటనల్లో మొత్తం 87 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత గల ప్రాంతంగా భావించే దేశాల్లో ఒకటైన నార్వే రాజధానిలో ఈ ఘటన జరగడం నార్వే వాసులను షాక్ కి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోగా, ఒకటి లేదా రెండు గంటల అనంతరం సమీపంలోని ఉటోయా ద్వీపంలో పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తి జరిపిన కాల్పుల్లో దాదాపు 80 మంది ప్రజలు చనిపోయారని ఓస్లో పోలీసులు తెలిపారు. 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన ట్రైన్ బాంబు పేలుళ్లలో 191 మంది చనిపోయాక మళ్ళీ ఇంత స్దాయిలో దాడులు జరగడం యూరప్ లో ఇదే మొదటిసారి.
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓస్లోలో, ప్రధానమంత్రి కార్యాలయం సమీపంలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. మొదట ఇద్దరు చనిపోయారని చెప్పిన పోలీసులు తర్వాత ఆ సంఖ్య ఏడుగురికి పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఉటోయా ద్వీపంలో పాలక పార్టీకి చెందిన యువజన సంఘం సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో యువకుడొకరు పోలీసు దుస్తులు ధరించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. మొదట భూభాగంపై కనుచూపు మేరలో ఉన్నవారందరిపైనా కాల్పులు జరిపిన ఆ వ్యక్తి, అనంతరం నీళ్ళలో ఉన్నవారిపై కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారని ది హిందూ పత్రిక తెలిపింది.
ద్వీపంలో జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోయారని పోలీసులు మొదట చెప్పారు. శనివారం ఉదయానికి 80 మంది చనిపోయారని వారు తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకొని జీర్ణించుకోవడానికి చాలా సమయం తీసుకుందని పోలీసులు తెలిపారు. బాంబులు ఉంచినదీ, ఉటోయాలో కాల్పులు జరిపింది ఒక వ్యక్తేననీ పోలీసులు చెప్పారు. అతను నార్వే దేశస్ధుడేననీ, ముస్లిం కాదని వారు తెలిపారు. అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్ధలతో ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలేవీ లేవని వారు తెలిపాదు. 32 ఏళ్ళ నిందితుడు తనంత తానే ఈ ఘతుకానికి పాల్పడ్డాడని అంతా చెబుతున్నారు. కాల్పుల్లో మృతి చెందినవారి సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.
నిందితుడి పేరును పోలీసులు విడుదల చేయనప్పటికీ నార్వే జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్ టివి2 లో అతని పేరును యండర్స్ బేరంగ్ అని తెలిపాడు. రెండు ఘటనలు నార్వే పాలక పార్టీ పై ఎక్కుపెట్టబడి ఉండటం గమార్హం అని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా పేలుళ్ళలో రెండు అంతకంటే ఎక్కువ బాంబులు ప్రయోగించి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.


Please increase the font size. Its little difficult to read. Good job by the way!
హలో సంజయ్
అక్షరాల పరిమాణం పెంచడానికి వర్డ్ ప్రెస్ లో ఉపకరణం ఏమీ నాకు దొరకలేదు. గతంలో ప్రయత్నించినా లభ్యం కాలేదు. ధీమ్ ని బట్టి అక్షరాల సైజు ఫిక్స్‌డ్ గా ఉంటుందిక్కడ.
మీరు చదివే బ్రౌజర్ లోనే ctrl + షార్ట్ కట్ ఉపయోగించి అక్షరాల సైజు పెంచవచ్చనుకుంటా. ఐనా నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, ఇంకేమన్నా పద్ధతి ఉందేమో, తెలుసుకోడానికి.
మీ సూచనకి ధన్యవాదాలు.