కంప్యూటర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్త రూపాయి సింబల్


Indian Rupee

చెన్నైలో 2010 మంది స్కూల్ పిల్లలు రూపాయి సింబల్ ను ప్రదర్శిస్తున్న దృశ్యం

ఇకనుండి రూపాయి సింబల్‌ను డాలర్, పౌండ్, యూరో లాగా కంప్యూటర్ లో టైప్ చెయ్యవచ్చు. దీనికోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ (టి.డి.ఐ.ఎల్) వెబ్ సైట్ (http://tdil-dc.in/) నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ఎందువల్లనో ప్రస్తుతం లోడ్ కావడం లేదు.  ఆ తర్వాత కీ బోర్డులో ‘Alt Gr’ ను 4 తో కలిపి టైప్ చేసినట్లయితే రూపాయి సింబల్ కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతుంది. Alt Gr కీ లేని కీ బోర్డుల్లో ctrl + alt + 4 ‘కీ’ ల కాంబినేషన్ లో రూపాయి సింబల్‌ను టై చేయవచ్చని టి.డి.ఐ.ఎల్ వెబ్ సైట్ తెలిపింది. పూర్తి వివరాలను ఇక్కడచూడవచ్చు.

మైక్రో సాఫ్ట్ సంస్ధ రూపాయి సింబల్ కోసం అప్ డేట్ ను విడుదల చేసింది. మైక్రో సాఫ్ట్ అప్ డేట్ ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ జెన్యూన్ అయితేనే అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి మైక్రో సాఫ్ట్ అనుమతిస్తోంది. రూపాయి సింబల్ ను ఎన్నుకున్న మూడు నెలలలోపే దీనికి కావలసిన సాఫ్ట్ వేర్ ను యూనికోడ్ కన్సార్టియం, ఐ.ఎస్.ఓ లు అభివృద్ధి చేశాయి. కొత్త రూపాయి గుర్తును ప్రమోట్ చేయడానికి వీలుగా యూనికోడ్ స్టాండర్డ్ లోనూ, జాతీయ స్టాండర్డ్ అయిన ఐ.ఎస్.సి.ఐ.ఐ లలోనూ ఎన్ కోడ్ చేసినట్లుగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

అందుబాటులో ఉన్న ఆధునిక సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు, ప్రమాణాలన్నింటిలోనూ టెక్స్ట్ రూపంలో యూనికోడ్ ప్రమాణంగా రూపొంచించడం జరిగిందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. AltGr + 4  లేదా ctrl+alt+4 కీ ల కాంబినేషన్ లో రూపాయి సింబల్ ఏర్పాటు చేయడానికి స్టేక్ హోల్డర్లు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపింది. టి.డి.ఐ.ఎల్ ప్రోగ్రాం ప్రస్తుతం కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. దేవనాగరి లిపిలోని ‘ర’ మరియు రోమన్ లిపిలోని ‘ఆర్’ అక్షరాల మిశ్రమంగా రూపాయి సింబల్ ను తయారు చేశారు. ముంబై ఐ.ఐ.టి కాలేజిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డి.ఉదయ్ కుమార్ ఈ సింబల్ కు రూపం ఇవ్వగా భారత ప్రభుత్వం గత సంవత్సరం జులైలో ఆమోదించింది.

వ్యాఖ్యానించండి