ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్


A barricade at the site of a blast near the Opera house

ఒపేరా హౌస్ వద్ద నిర్మించిన తాత్కాలిక బారికేడ్ వద్ద పోలీసు కాపలా

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ

Mumbai blasts on July 13, 2011

ముంబై పేలుళ్లు, జులై 13, 2011

బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా హౌస్ వద్ద పేలిందని పోలీసులు తెలిపారు.

కబూతర్ ఖానా వద్ద పేలిన బాంబును హనుమాన్ మందిర్ వద్ద ఉంచారనీ ఆ పేలుడులో బస్టాండ్ ధ్వంసం అయ్యిందనీ, ఆ దారిన పోతున్న కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాని తెలుస్తోంది. జావేరీ బజార్‌లో పేలిన బాంబును ఒక గొడుగులో ఉంచగా, ఒపేరా హౌస్ వద్ద పేలిన బాంబును ఒక మేన్ హోల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. దాదర్‌లో బాంబు పేలిన సమయంలో అక్కడే ఉన్న పాఠశాల పిల్లలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో గుమికూడతారనీ అదృష్టవశాత్తూ వారెవరికీ గాయాలు కాలేదనీ అక్కడ ఉన్న షాపులు వారు తెలిపారు. ఆ సమయంలో కనీసం అక్కడ150 నుండి 200 వరకూ జనం ఉంటారనీ తెలుస్తోంది.

వజ్రాల అమ్మకాలకు పేరు గాంచిన జావేరీ బజార్ లో బాంబు పేలుళ్ళు జరగడం 1993, 2003 ల తర్వాత ఇది మూడవసారని పోలీసు అధికారి తెలిపాడు. “ఖావ్ గల్లీ” అని పిలిచే సందులో జరిగిన ఈ పేలుడు సమయంలొ సాయంత్రం ఏదైనా తినడానికి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడతారని తెలుస్తోంది.

బాంబు పేలుడు సంభవించిన ఒక చోట వైర్లతో కూడిన విద్యుత్ సర్క్యూట్ ధరించిన శవం దొరికిందనీ, కనుక మానవ బాంబు పేలుడును తోసిపుచ్చలేమనీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డి.జి, సమాచారం అందించినట్లుగా హోం శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ పత్రికల

Home Minister P. Chidambaram visiting the blast site at Zaveri Bazar

జావేరీ బజారులో పేలుడు స్ధలాన్ని పరిశీలిస్తున్న కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం

వారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బాంబు పేలుళ్ళలొ ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబానికి ఒక్కొక్కొరికి రు.5 లక్షలు నష్ట పరిహారం ఇస్తున్నట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ప్రకటించాడు. బుధవారం రాత్రి పృధ్వీరాజ్, కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంతో కలిసి పేలుళ్ళు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. ఉగ్రవాద దాడులు గురించి ముందు కొంత సమాచారం ఉన్నదనీ, కానీ వివరాలేవీ తెలియరాలేదనీ పోలీసులు చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.

ఇదిలా ఉండగా ముంబై బాంబు పేలుళ్ళను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించాడు. ఏ కారణం చెప్పుకున్నప్పటికీ టెర్రరిస్టు దాడులు సమర్ధనీయం కాదని ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కూడా పేలుళ్ళను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. గాయపడినవారిలో 23 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. పూర్తి సమన్వయంతో బాంబు పేలుళ్ళు జరిపారని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రకటించాడు. పాకిస్ధాన్, ఇండియాల మధ్య త్వరలో జరగనున్న శాంతి చర్చల నేపధ్యంలో, చర్చలకు భంగం కలగించడానికే పేలుళ్ళు జరిగాయా అన్న ప్రశ్నకు చిదంబరం, ఏ కోణాన్నీ విస్మరించబోవడం లేదనీ ప్రపంచ టెర్రరిజానికి కేంద్రాలుగా ఉన్న పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ దేశాలు మనకు పొరుగున ఉన్నాయనీ ఆయన వ్యాఖ్యానించాడు.

వ్యాఖ్యానించండి