అమెరికా 14.3 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ అప్పు చేయకూడదని పరిమితి ఉంది. మూడు దురాక్రమణ యుద్ధాల పుణ్యమాని అప్పు గరిష్ట పరిమితిని చేరుకుంది. అప్పులు చేసి ఆర్ధిక సంక్షోభంలో కుదేలైన బడా బడా వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం బెయిలౌట్లు ఇచ్చింది. యుద్ధాలు మానేస్తే ఈ పరిస్ధితి వచ్చి ఉండకపోను. ఇప్పుడు అమెరికా తెచ్చిన కొన్ని అప్పులపై వడ్డీల చెల్లింపులకు, మరి కొన్ని అప్పుల పూర్తి చెల్లింపులకు గడువు ఆగష్టు 2 తేదీ గడువు. ఆ లోపు అప్పు చెల్లింపులు చేయాలంటే అమెరికా కొత్త అప్పులు చేయాలి. గరిష్ట పరిమితికి చేరుకుంది కనుక కొత్త అప్పులు చేయాలంటే కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. అందుకని గరిష్ట పరిమితి పెంచమని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, కాంగ్రెస్‌ను బతిమాలుతున్నాడు. ఈ పరిస్ధితిని వర్ణిస్తూ న్యూయార్క్ కి చెందిన ఆర్.జె.మాట్సన్ వేసిన కార్టూన్ ఇది.
