నూతన మిలీనియంలో భాషలో ఇప్పటికే ఉన్న పదాలకు కొత్త అర్ధాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ఉన్న అర్ధం నేడు ఉండకపోవచ్చు. ఈ రోజున్న అర్ధం రేపు పాతబడిపోవచ్చు. పాత సీసాలోనే కొత్త సారా అన్నమాట! పైకి ఎప్పటిలాగే కనపడినా లోపల సారంలో మాత్రం తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక దేశంపైకి దాడి చేయడానికి ఆ దేశంలో ప్రపంచాన్ని నాశనం చేయగల “సామూహిక విధ్వంసక ఆయుధాలు” ఉన్నాయని సాకు చూపడం నిన్నటి టెక్నిక్కు. ఆ దేశంలోని ప్రజల రక్షణకే ముప్పు వచ్చిందని చెప్పి ఆ ప్రజలనే చంపడం నేటి రూలు.
‘ఎ’ ఫర్ ‘ఎయిర్ స్ట్రయిక్’ [‘A’ for ‘Air Strike (వైమానిక దాడి)’]
పరాయి దేశంలో ప్రజాస్వామ్యం స్ధాపిస్తాననీ, ఆ దేశంలోని టెర్రరిస్టులనుండి స్వదేశ ప్రజలను రక్షిస్తాననీ సైన్యాన్ని పంపి ఓట్లు పొందడం నిన్నటి జిమ్మిక్కు. పరాయి దేశానికి వెళ్ళి మారణహోమం సృష్టిస్తూ, ఆ మారణహోమంలోనే బలవుతున్న సైన్యాన్ని వెనక్కి రప్పించి ఓట్లు కోరడం నేటి లాజిక్కు.
‘బి’ ఫర్ ‘బారక్ ఒబామా’ [‘B’ for ‘Barack Obama (బారక్ ఒబామా)’]
“స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలే ప్రపంచానికి శ్రీరామ రక్ష” అని నిన్నటి పౌరోహిత్యం. “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” ఏర్పడితే దిక్కూ దరీ కానక, ప్రభుత్వాల చేతనే ‘బెయిలౌట్లు’ ఇప్పించడం నేటి అఘాయిత్యం. నిన్న ఛీ అని ‘మేనార్డ్ కీన్స్’ ని తిట్టిపోసిన నోటితోనే, నేడు “ఆహా ఆపద్భాందవుడు” అంటూ రహస్య అనుచరణ.



Cartoons are very nice. …pr
Good callection sekhar garu
ధన్యవాదాలు, భాస్కర్ గారూ.