ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన “ది గ్రేట్ రిసెషన్,” అమెరికాలో డిసెంబరు 2007 లో ప్రారంభం కాగా, జూన్ 2009 లో ముగిసిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి అమెరికాలో ప్రవేటు కంపెనీలు రిసెషన్ ముందు స్ధాయిలో లాభాలు సంపాదిస్తుండగా, ఉద్యోగాల మార్కెట్ మాత్రం ఇంకా కోలుకోలేదు. సంక్షోభం ముగిసాక జూన్ 2009 లో అమెరికాలో 130.5 మిలియన్ల ఉద్యోగాలు ఉండగా, వాటి సంఖ్య రెండేళ్ళ తర్వాత జూన్ 2011 నాటికి కేవలం అర మిలియన్ మాత్రమే పెరిగి 131 మిలియన్లకు చేరుకుంది. ఖచ్చితంగా చెప్పాలంటే గత రెండేళ్ళలో అమెరికాలో సృష్టించబడిన నికర ఉద్యోగాలు 523,700. కొన్ని రంగాల్లో ఉద్యోగాలింకా రద్దవుతూనే ఉన్నాయి.
వివిధ ఉత్పత్తి రంగాల వారిగా చూసినట్లయితే నష్టపోయిన, సృష్టించబడిన ఉద్యోగాలు కింది పట్టికలో చూపిన విధంగా ఉన్నాయి. కనీసం ఆరు ఉత్పత్తి రంగాల్లో అమెరికా ఇంకా ఉద్యోగాలు కోల్పోతూనే ఉంది.

Hai i am shafi
?!