ఎట్టకేలకు హమీద్ కర్జాయ్ సోదరుడిని చంపేసిన మిలిటెంట్లు


Ahmed Wali Karzai

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు అహ్మద్ వలి కర్జాయ్

అనేక సార్లు మిలిటెంట్ల హత్యా ప్రయత్నాలనుండి తప్పించుకున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు అహ్మద్ వాలి కర్జాయ్ మంగళవారం హత్యకు గురయ్యాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలొ చోటు చేసుకున్న అనేక తప్పులకు అహ్మద్ కర్జాయ్ కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్నాదు. హమీద్ కర్జాయ్ అవినీతిలో అహ్మద్ కర్జాయ్ అసలు పాత్రధారి అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికా వైపు నుండి కూడా ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎందరు ఎన్ని విధాలుగా ఆరోపించినప్పటికీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, తన సోదరుడిని సమర్ధించుకుంటూ వచ్చాడు.

అహ్మద్ వాలి కర్జాయ్ కాందహార్ రాష్ట్ర కౌన్సిల్ కి అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన హత్యను కాందహార్ కౌన్సిల్ ప్రతినిధి జల్మాయ్ అయుబి, అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి సేదిక్ సెదిక్కి ధృవీకరించారు. దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్‌లో అహ్మద్ కర్జాయ్ అనేక నేరాలకు కాల్పడ్డాడని ఆరోపణలు వచ్చినప్పటికీ హమీద్ కర్జాయ్ వాటన్నింటిని కొట్టిపారేశాడు. ఆయనపై వివిధ టెర్రరిస్టు గ్రూపులు హత్యా ప్రయత్నం చేశాయి. ఆయనను హత్య చేసిన గ్రూపు ఏదో ఇంకా వెల్లడి కాలేదు. తానే భాద్యురాలినని ఏ సంస్ధా ప్రకటించలేదు ఇంతవరకూ.

అహ్మద్ కర్జాయ్ తన ఇంటివద్దనే హత్యకు గురయ్యాడు. 2009 మే నెలలో తూర్పున గల నంగర్హార్ రాష్ట్రంలో అతని మోటార్ కేడ్ పై జరిగిన రాకెట్ల దాడిలో అహ్మద్ తప్పించుకున్నాడు. అప్పుడు ఒక బాడీ గార్డు చనిపోయాడు. మళ్ళీ రెండు నెలల్లోనే జులై నెలలో తాలిబాన్‌కి చెందిన అత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. కాందహార్ రాష్ట్ర కౌన్సిల్ కార్యాలయంపై జరిగిన ఈ దాడిలో కూడా అహ్మద్ తప్పించుకున్నాడు. దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందే అక్కడి నుండి అహ్మద్ వెళ్ళిపోవడంతో తప్పించుకున్నాడు.

కాని జులై 12న అహ్మద్ వాలి కర్జాయ్ తప్పించుకోలేకపోయాడు. ఆయన మరణంతో హమీద్ కర్జాయ్ తన అవినీతి ఆదాయ మార్గాన్ని కోల్పోయాడని చెప్పవచ్చు.

వ్యాఖ్యానించండి