అమెరికాలో ఆరు బ్యాంకుల అధికారులకు చెల్లించిన జీతాలూ, బోనస్ ల మొత్తం కాన్సాస్ రాష్ట్ర జీడీపీ కి సమానం


అమెరికాలో ఫైనాన్స్ సంస్ధలు దోపిడీకి పెట్టింది పేరు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా అది అమెరికా ఆర్ధిక వృద్ధి కోసమే. వాళ్ళవలన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించి అమెరికా, యూరప్ లు అతలాకుతలమైనా అది ప్రపంచ ఆర్ధిక వృద్ధికీ, ప్రపంచ ప్రజల సంతోషం కోసమే. ప్రపంచ ప్రజల సంతోషం కోసం అహోరాత్రాలూ కష్టపడుతున్న బ్యాంకు ఎగ్జిక్యూటివ్ సిబ్బంధికి బ్యాంకులు ఇచ్చే జీతాలూ, బోనస్^లూ, వివిధ సదుపాయాల మొత్తం ఎంతో రాయిటర్స్ సంస్ధ లెక్కేసింది. వాల్ స్ట్రీట్ బ్యాంకుల్లో ఆరు పెద్ద బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ లకు ఒక సంవత్సరంలో చెల్లించిన మొత్తం చూస్తే అది అమెరికాలో 2.9 మిలియన్ల జనాభా గల కాన్సాస్ రాష్ట్ర వార్షిక జీడీపీ తో స్మానమని తేలింది. ఆ విషయాన్నే అంకెల్లో చూస్తే:

బ్యాంకు పేరు

ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించిన

జీతాలు + సదుపాయాలు + బోనస్

ల మొత్తం

బ్యాంక్ ఆఫ్ అమెరికా $35.1 బిలియన్లు
వేల్స్ ఫార్గో బ్యాంక్ $26.1 బిలియన్లు
జె.పి మోర్గాన్ చేస్ $25.4 బిలియన్లు
సిటీ గ్రూప్ $22.6 బిలియన్లు
గోల్డ్ మేన్ సాచ్ $17.5 బిలియన్లు
మోర్గాన్ స్టాన్లీ $16.0 బిలియన్లు
ఆరు బ్యాంకులు చెల్లించిన మొత్తం $142.7 బిలియన్లు

‘డాలర్స్ అండ్ సెన్స్’ అనే వెబ్ సైట్ ఈ మొత్తం ఎంతో అర్ధం చేసుకోవడానికి వివిధ అంశాలతో పోల్చింది. ఇలా:

ఈ మొత్తం

  • అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల వార్షిక జిడిపితో సమానం. లేదా
  • అమెరికాలో  న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలోని వెర్మోంట్ రాష్ట్ర జిడిపికి అయిదురెట్లు. లేదా
  • అమెరికాలో మెయినే రాష్ట్ర జిడిపికి మూడు రేట్లు. లేదా
  • అమెరికాలో న్యూ మెక్సికో రాష్ట్ర జిడిపికి రెండు రేట్లు. లేదా
  • అమెరికాలో కాన్సాస్ రాష్ట్ర జిడిపికి సమానం.

ఈ బహుళ జాతి ఫైనాన్స్ కంపెనీల ఆరాచకాలకు అడ్డు కట్ట వేయాలని జి-20 గ్రూపు దేశాల సమావేశాలు గట్టిగా తీర్మానించుకున్నాయి. కానీ ఇంతవరకూ ఆ దిశలో ఏ దేశమూ ఎంతవరకూ ఒక్క చట్టమూ చేయలేక పోయాయి.

వ్యాఖ్యానించండి