ఇరాన్, వెనిజులా సంబంధాలపై మితవాదుల అనుమానాలు -కార్టూన్


ఆర్ధిక సూత్రాలకు సంబంధించినంతవరకూ మితవాదులంటే ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ సౌకర్యాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలని గుదిబండలని చెబుతూ ప్రవేటోళ్ళకి అమ్మేయాలనడం, ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వనవసరం లేదనడం, ఒక పద్ధతిలో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించుకోవడాన్ని తిరస్కరిస్తూ అంతా మార్కెట్లో ఉండే ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధల ఇష్టాయిష్టాలకి వదిలేయాలని ప్రభోధించడం. ఒక్క ముక్కలో చెప్పాలంటె మితవాదం ప్రజల సుఖ సంతోషాలకు వ్యతిరేకం, కోటీశ్వరులు లేదా బిలియనీర్ల ధనదాహానికి అనుకూలం.

Paranoia - paraguana

చూశారా, చూశారా! ఇరాన్ మిసైళ్ళను ఛావెజ్ ఎలా కప్పిపెట్టాడో!?

చూశారా, చూశారా! ఇరాన్ ఇచ్చిన మిసైళ్ళను ఛావెజ్ ఎలా కప్పిపెట్టాడో!?

ఈ మితవాదులకి ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వాలు ఏం చేసినా అనుమానమే. ప్రభుత్వరంగాన్ని పెంచి పోషిస్తున్న వెనిజులా తో ఇరాన్ స్నేహ సంబంధాలు కలిగినందుకు వెనిజులాలో గాలి మరలను కూడా ఇరాన్ సరఫరా చేసిన “లాంగ్ రేంజ్ మిసైళ్ళు” గానే కనిపిస్తున్నాయని కార్టూనిస్టు చెబుతున్నారు.

వ్యాఖ్యానించండి