రెండు యుద్ధాలు
అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు.
మూడు ఫోటోలు

ప్రజాస్వామ్యం నిర్మిస్తానని ఇరాక్‌పై అమెరికా చేసిన దండయాత్ర అనంతరం ఆ దేశం తెగలు, ఉప ఉపమతాల కొట్లాటలకు కేంద్రంగా మిగిలింది. చీలికలు, పేలికలుగా చినిగి ముక్కలవుతున్న ఇరాక్ రాజధానిలో ఆత్మాహుతి దాడిలో ఆహుతి ఐన కుటుంబం సభ్యుడైన నాలుగేళ్ళు కూడా నిండని బాలుడి శవం

ఒక స్వతంత్ర దేశం ఇరాక్‌పైన అమెరికా, ఐరోపా దేశాలు జరిపిన దురహంకార దురాక్రమణ దాడి అనంతరం స్మశానాన్ని తలపిస్తున్న బాగ్దాద్ లోని యూదుల ప్రాంతం

ఎక్కడ పుట్టి, ఎక్కడ పెరిగి, ఆఫ్ఘనిస్ధాన్‌కి ఎందుకొచ్చారు? ఎవరి కోసం ప్రాణాలొదిరారు? --అమెరికా పాలకుల సామ్రాజ్యవాద దండయాత్రలో పావులు, సమిధలు ఈ అమెరికన్ సైనికులు--
కొన్ని వాస్తవాలు:
అమెరికా, దాని మిత్ర రాజ్యాలు టెర్రరిజంపై యుద్ధం పేరుతో సాగించిన నరమేధంలో ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లో జరిగిన ధన ప్రాణ నష్టం పూర్తిగా ఎంతో ఇంకా తేలలేదు. బహుశా తేలదేమో కూడా. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయన సంస్ధ బొమ్మల్లో చెప్పిన కొన్ని యుద్ధ వాస్తవాలు చూడండి.


Good humanity information