డీజెల్, కిరోసిన్, గ్యాసు ధరలు పెంచకముందే ఇంధన ధ్రవ్యోల్బణం పెరగి కూర్చుంది. పెరిగిన ధరలు తోడైతే ప్రధాన ద్రవ్యోల్బణం మళ్ళీ రెండంకెలకు చేరుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకు అంచనా వేస్తున్నారు. వెరసి భారత ప్రజలు భరించలేక సతమతమవుతున్న అధిక ధరలు మరింతగా పెరుగనున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడమే ఒకింత ఓదార్పు. కానీ తగ్గిన అంశాలకంటె పెరిగిన అంశాలు మరీ ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోంది.
జూన్ 18 తో ముగిసే వారంతో అంతమైన సంవత్సరానికి ఇంధన ద్రవ్యోల్బణం 12.98 శాతంగా నమోదైంది. అంతకు ముందు వారంతో ముగిసిన సంవత్సరానికి 12.84 శాతంగా ఇంధన ద్రవ్యోల్బణం నమోదైన సంగతి విదితమే. గురువారం ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్ 11 తో ముగిసిన సంవత్సరానికి 9.13 శాతం కాగా, అది జూన్ 18 తో ముగిసిన సంవత్సరంంలో 7.78 శాతానికి తగ్గింది. అయితే ఇంధన ద్రవ్యోల్బణం రవాణా ఖర్చులతో ముడిపడి ఉన్నందున ఇతర అన్ని సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ విధంగా ఇంధన ద్రవ్యోల్బణం, ప్రధాన ద్రవ్యోల్బణంపై అధిక భారం పడవేస్తుంది.
మే నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం 9.06 శాతంగా నమోదైంది. ఇది రెండంకెలకు అంటె పది శాతం కంటె ఎక్కువకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు మరో 70 బేసిస్ పాయింట్లు (0.7 శాతం) పెరగవచ్చని అంచనా వేస్తోంది. మరికొన్ని సంస్ధలు 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) కంటె ఎక్కువగానే పెరగవచ్చని చెబుతున్నారు. మొత్తం మీద సామాన్య మానవుడి పరిస్ధితి మరింత దుర్భరం కాక తప్పదు. డీజెల్, వంట గ్యాసు, కిరోసిన్ లు టోకు ధరల సూచి మొత్తంలో 6.4 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో పెట్రోలు కలిసి లేదు. ఇంధన ద్రవ్యోల్బణం తోపాటు ప్రధాన సరకుల ధరల సూచి 11.84 శాతం నుండి 12.62 శాతానికి పెరిగింది.
2011-12 ఆర్ధిక సంవత్సరం చివరకి బడ్జెట్ లోటు 5.4 శాతం నుండి 4.6 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచ స్ధాయి మార్కెట్ విశ్లేషణా సంస్ధలు ఇది మరీ ఆశావాదంతో కూడిన లక్ష్యమని వాదిస్తున్నాయి. లోటు అంత పెద్ద మొత్తంలో తగ్గించగలగడం సాధ్యం కాకపోవచ్చని వారి వాదన. ప్రభుత్వం డీజెల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచడంతో పాటు పెట్రోల్ ఉత్పత్తులపై కష్టమ్స్, ఎక్సైజ్ సుంకాల తగ్గింపుకు నిర్ణయించడం మార్కెట్ పండితులకి ఇస్టం లేదు. దీనివల్ల రు.45,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి బడ్జెట్ లోటు తగ్గించడం కష్టమని రాయిటర్స్ సంస్ధ చెబుతోంది. కానీ ఇండియాలో
