అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని ఒబామా బలగాల ఉపసంహరణ ప్రకటిస్తూ అన్నాడు. బలగాల ఉపసంహరణకు ఈ ఖర్చు కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు. కాని ఒబామా చెప్పిన లెక్క పూర్తిగా తప్పు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ‘వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ అమెరికా సాగిస్తున్న యుద్ధ ఖర్చులపై అధ్యయనం చేసింది. 2001 నుండి అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, పాకిస్ధాన్ లలో సాగించిన యుద్ధాలకు ఖర్చయిన సొమ్ము, అన్ని వైపులా ఎంతమంది చనిపోయారు తదితర అంశాలను అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది.
ఈ సంస్ధ అధ్యయనం ప్రకారం ఇప్పటివరకూ అయిన ఖర్చు మరియు రిటైరీలకు లేదా వెటరన్లకు కానున్న ఖర్చు మొత్తం 3.7 ట్రిలియన్ డాలర్లు కాగా చనిపోయినవారి సంఖ్య 224,475. అధ్యయనం వెల్లడించిన వివరాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
ఆర్ధిక నష్టం లేదా ఖర్చు:
- 2001 నుండి పెంటగాన్ యుద్ధ ఖర్చుల కోసం కాంగ్రెస్ ఆమోదించిన సొమ్ము: $1.3 ట్రిలియన్లు
- పెంటగాన్ బేస్ బడ్జెట్‌లో అదనంగా ఐన ఖర్చు: $362 బిలియన్ నుండి $652 బిలియన్లు
- పెంటగాన్ యుద్ధ ఖర్చులకోసం చేసిన అప్పుపై వడ్డీ: $185 బిలియన్లు
- సైనికుల వైద్య ఖర్చులు, వికలాంగుల ఖర్చులు: $33 బిలియన్లు
- యుద్ధ సంబంధిత అంతర్జాతీయ సహాయం: $74 బిలియన్లు
- హోం లాండ్ సెక్యూరిటీ బేస్ కోసం అదనపు ఖర్చులు: $401 బిలియన్లు
- వెటరన్ యోధులకు 2050 వరకు అయ్యే వైద్య ఖర్చుల అంచనా (Projected obligations): $589 బిలియన్ల నుండి $934 బిలియన్ల వరకు
- వెటరన్లకు, మిలట్రీ కుటుంబాలకు ఇప్పటివరకూ ఐన సామాజిక ఖర్చు: $295 బిలియన్ల నుండి $400 బిలియన్ల వరకు
ఇప్పటి యుద్ధాలవలన భవిష్యత్తులో అయ్యే ఖర్చులు
- 2012 పెంటగాన్ యుద్ధ ఖర్చులు: $118 బిలియన్లు
- 2012 విదేశీ సాయం: $12 బిలియన్లు
- 2013-2015 యుద్ధ ఖర్చుల అంచనా: $168 బిలియన్లు
- 2016-2020 యుద్ధ ఖర్చుల అంచనా: $155 బిలియన్లు
- అంచనా మొత్తం: $3.7 ట్రిలియన్ నుండి $4.4 ట్రిలియన్ వరకు
- 2020 వరకు అదనపు వడ్డీ చెల్లింపులు: $1 ట్రిలియన్
వార్ జోన్ల వారీగా అతి తక్కువ అంచనాల ప్రకారం విగతులైన వారి సంఖ్య
- ఆఫ్ఘనిస్ధాన్: 33,877
- ఇరాక్: 151,471
- పాకిస్ధాన్: 39,127
కేటగిరీల వారీగా చనిపోయిన వారి సంఖ్య (అతి తక్కువ అంచానాల్లో)
- అమెరికా మిలట్రీ (సైనికులు): 6,051
- అంగవైకల్యం దరఖాస్తులు: 550,000 (ఇంకా వస్తూనే ఉన్నాయి, గాయాలతో జబ్బుపడినవారు ఇందులో లేరు)
- అమెరికా కాంట్రాక్టర్లు (గూఢచర్యం):2,300 (చాలా మంది మరణించిన కాంట్రాక్టర్లను గుర్తించలేదు)
- ఇరాక్ భద్రతా బలగాలు: 9,922
- ఆఫ్ఘనిస్ధాన్ భద్రతా బలగాలు: 8,756
- పాకిస్ధాన్ భద్రతా బలగాలు: 3,520
- ఇతర మిత్ర దేశాల సైనికులు: 1,192
- ఆఫ్ఘనిస్ధాన్ పౌరులు: 11,700
- ఇరాక్ పౌరులు: 125,000
- పాకిస్ధాన్ పౌరులు + తిరుగుబాటుదారులు: 35,600
- ఆఫ్ఘనిస్ధాన్ తిరుగుబాటుదారులు: 10,000
- అమెరికా దాడి సందర్భంగా చనిపోయిన ఇరాక్ సైన్యం (సద్దాం సైన్యం): 10,000
- జర్నలిస్టులు, మీడియా కార్మికులు: 168
- మానవతా సహాయ కార్యకర్తలు: 266
- యుద్ధాల శరణార్ధులు, తమ స్వస్ధాలను బలవంతంగా ఖాళీ చేసినవారు మొత్తం: 7,800,000 (లేదా 78 లక్షలు. ఈ సంఖ్య కనెక్టికట్, కెంటకీలలో నివసిస్తున్నవారంతా ఇళ్ళొదిలి పారిపోవడంతో సమానమట)
- యుద్ధాలు అమెరికాలో పౌరహక్కుల్ని హరిస్తే, యుద్ధ ప్రాంతాల్లో మానవ హక్కుల్ని పూర్తిగా ఉల్లంఘించారు
- మానావ, ఆర్ధిక నష్టం మరికొన్ని దశాబ్దాలు కొనసాగుతుంది. యుద్ధ ఖర్చులు చాలా వరకు లెక్కకు రాకుండా వివిధ బడ్జెట్లలో తొక్కేశారు. అవి ఎన్నటికీ అమెరికన్లకు తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకి పెంటగాన్ యుద్ధ ఖర్చుల బడ్జెట్టే ($1 ట్రిలియన్) మొత్తం యుద్ద ఖర్చని ఒబామా చెప్తున్నాడు. కానీ వాస్తవంగా అయిన ఖర్చూ, ఖర్చయ్యీ చెల్లించవలసి ఉంది $3.2 ట్రిలియన్లు. సకారణంగా అంచనా వేస్తే ఇది $4 ట్రిలియన్లు ఉంటుంది.
- గత యుద్ధాల అనుభవాల ద్వారా తెలిసిందేమంటే, ఇప్పటి యుద్ధాలలో గాయపడి, జబ్బుపడిన వారందరి సైనికులపై భవిష్యత్తులో కూడా ఖర్చులుంటాయి. అది కూడా కలిపితే తప్ప పూర్తి ఖర్చును లెక్కించలేము.
- యుద్ధ ఖర్చులకోసం నిధుల తరలింపువలన నిరుద్యోగం, వడ్డీల పెంపుదల ఫలితాలుగా మిగిలాయి. ఈ క్రమం కొనసాగుతోంది. ఆగలేదు.
- యుద్ధాలకు ముందు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో ప్రజాస్వామ్యం స్ధాపిస్తామని హామీ ఇచ్చారు. కానీ రాజకీయ స్వేచ్ఛా పరంగా చూస్తే రెండూ చివరి స్ధానాల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో యుద్ధ ప్రభువులు అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. అదీ అమెరికా మద్దతుతో. ఇరాక్ ప్రజలు యుద్ధం ముందు కంటె ఎక్కువగా చీలిపోయి ఉన్నారు. లైంగికంగా, తెగల పరంగా మరింత అణిచివేతలను ఎదుర్కొంటున్నారు.
- మొత్తం విగతులు: 224,475 (ఇది చివరాఖరి సంఖ్య కాదు. కొనసాగుతున్న యుద్దాల్లో మరింతమంది విగతులవుతూనే ఉన్నారు)

This is the BEST blog I have read
Please focus and spread information (analysis) on 100% FDI in retail and agricultural sector.
Thanks for your efforts. May God Bless You.
Hi Reddy garu, I have written an article on privatization of retail sector which is headed as “ద్రవ్యోల్బణం సాకుతో రిటైల్ రంగ ప్రైవేటీకరణ…..” or something like that. I’ve also written the effects of privatization in agri-sector and will be writing more and more. Thanks for your encouragement.