“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే


Anna_hazare

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని అన్నా మహాత్మాగాంధీ సమాధి “రాజ్ ఘాట్” వద్దకుమార్చుకున్నాడు.

అన్నా హజారే ఐదు రోజుల నిరాహార దీక్ష అనంతరం కేంద్రప్రభుత్వం లోక్ పాల్ బిల్లు రూప కల్పనకు ఓ కమిటీ వేయడానికి అంగీకరించింది.హజారే కోరిక మేరకు డ్రాఫ్టింగ్ కమిటీలో సగం మందిని (ఐదుగురు) పౌర సమాజకార్యకర్తలను నియమించింది. అయితే కమిటీ ఏర్పాటు చేసినప్పటినుండీ కాంగ్రెస్ప్రభుత్వం లోని మంత్రులు డ్రాఫ్టింగ్ కమిటీలోని పౌర సమాజ ప్రతినిధులపై విషప్రచారం ప్రారంబించారు. కమిటీలో సభ్యులైన శాంతి భూషణ్, ప్రశాంతి భూషణ్ లుతండ్రీ కొడుకులైనందున ఒకే కుటుంబం నుండి ఇద్దరు కమిటీలో ఉండడం ఏంటన్నప్రశ్నను లేవనెత్తారు. అది సమసి పోయాక శాంతి భూషణ్ పన్ను ఎగవేయడానికిప్రయత్నించాడంటూ సమస్య కాని సమస్యను తవ్వి తీశారు. కమిటీలోని పౌర సమాజసభ్యులు శాంతి భూషణ్ విషయాన్ని పరిశీలించి అందులో ఆయన తప్పేమీ చేయలేదనితేల్చారు.

ఆ తర్వాత బిల్లు రూపకల్పనలో అనేక ఆటంకాలను ప్రవేశ పెడుతూవచ్చారు. మొదట పార్లమెంటు సభ్యులెవరినీ లోక్ పాల్ పరిధిలోకి తేవడానికివీల్లేదన్నారు. పార్లమెంటు సభ్యులపై విచారణ చేసే అధికారం లేనప్పుడు లోక్పాల్ బిల్లే అవసరం లేదు. ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులనులోక్ పాల్ చట్టం నుండి మినహాయించాలని సరికొత్త వాదన ప్రారంభించారు.ఆశ్చర్యకరంగా ఈ వాదనకు బాబా రాందేవ్ నుండి కేంద్ర ప్రభుత్వానికి మద్దతులభించింది. అయితే బాబా రాందేవ్ తనదైన దీక్షను మొదలు పెట్టాక నిర్భంధంప్రయోగించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. అర్ధరాత్రి నిరాహారదీక్షపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడాన్ని సాత్వికుడంటూ ప్రచారం పొందినమన్మోహన్ “తప్పే కాని తప్పలేదు” అని ప్రకటించడంతో ప్రభుత్వంలోని అధికారులు, రాజకీయ నాయకులు తమ అవినీతిని ఎట్టిపరిస్ధితిలోనూ కొనసాగించడానికేనిర్ణయించుకున్నారని స్పష్టమయ్యింది.

గత నలభై ఏళ్ళనుండి లోక్ పాల్బిల్లును ప్రభుత్వాలు ఎందుకు వాయిదా వేస్తున్నదీ ఆ బిల్లుకు ప్రభుత్వంఇప్పుడు ఇస్తున్న ప్రతిఘటనతో స్పష్టం అవుతోంది. ప్రభుత్వాలు ఏర్పరచడానికిభారత దేశంలోని రాజకీయ పార్టీలు పడే ఆరాటం నిజానికి ప్రజల కోసం కాదు. వారిఆరాటం సంపదల కోసమే. ప్రభుత్వాధికారాన్ని అడ్డు పెట్టుకుని దేశ సంపదలనువ్యక్తిగత ఖాతాలకు మరలించుకుంటూ, ధనికులకు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికే అధికారానికి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చాకఅదే వారి ప్రధాన కార్యక్రమం. అటువంటి ప్రధాన కార్యక్రమానికే ప్రజలు ఆటంకంకలిగించడం రాజకీయ నాయకులకు, నిరంకుశ బ్యూరోక్రట్లకు సహజంగానే నచ్చడం లేదు.అందుకే లోక్ పాల్ బిల్లు కూడా వారికి నచ్చదు.

ఈ దేశంలో అభివృద్ధిపేరుతో జరుగుతున్న కార్యకలాపాలన్నీ అవినీతితో ముడిపడి ఉన్నవే.రోడ్డునిర్మాణం దగ్గర్నుండి, మురుగు కాల్వల నిర్మాణం వరకూ ప్రజాధనాన్నికాంట్రాక్టర్లూ, ప్రజా ప్రతినిధులుగా చెప్పబడుతున్న వాళ్ళూ, బ్యూరోక్రట్అధికారులూ వాటాలు వేసుకుని పంచుకోవడానికే తప్ప ప్రజల సౌకర్యాలకో, వారి బాగుకోసమో లేదా దేశ అభివృద్ధి కోసమో కాదు. అధికారంలోకి రావడానికి ప్రజల ఓట్లఅవసరం ఉంది కనుక కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కనిపిస్తుందే తప్పవాస్తవానికి ప్రజలకు చెందాల్సిన సంపద అంతా ప్రజల వద్దకు వస్తే ఈ దేశంలో ఒకఆకలి చావూ ఉండబోదు, ఒక్క భిక్షగాడూ రోడ్డుపైన కనపడడు. ఒక్క నిరసనా ప్రభుత్వకార్యాలయాల ముందు కనపడదు.

వ్యాఖ్యానించండి