తాజా వార్త: దేశం విడిచి వెళ్ళిన యెమెన్ అధ్యక్షుడు సలే


శుక్రవారం నాటి రాకెట్ దాడిలో గాయపడిన యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే మెరుగైన వైద్యం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళినట్లుగా బిబిసి ప్రకటించింది. అధ్యక్షుడు సలేతో పాటు అతని కొలువులోని ప్రధాని తదితర ముఖ్య అధికారులంతా దేశం విడిచి వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఆయన వైద్యం కోసమే వెళ్ళాడా లేక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాడా అన్నది వెంటనే తెలియరాలేదు.

శుక్రవారం గాయపడ్డాక అధ్యక్షుడు సలే మళ్ళీ ప్రజలకు టీవిలో కనిపించలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆడియో ప్రసంగాన్ని మాత్రమే ప్రసారం చేసింది. ఆ ప్రసంగం సలే చాలా కష్టంగా, భారంగ ఊపిరి తీసుకుంటూ ఇచ్చినట్లుగా ఉందని వార్తా సంస్ధలు తెలిపాయి. ఆయనతో పాటు ప్రధాని ఇతర ముఖ్య అధికారులు కూడా దేశం విడిచి వెళ్ళడం యెమెన్ ఘర్షణలకు ఇక ముగింపు వచ్చినట్లేనని భావించడానికి వార్తా సంస్ధలు సిద్ధంగా లేవు.

సనా యూనివర్సిటీలో విద్యార్ధులు, ట్యునీషియా, ఈజిప్టు ఆందోలనలకు ప్రేరిపితులై ప్రారంభించిన ఆందోలనలు చివరికి అధ్యక్షుడికీ దేశంలోని వివిధ తెగల మధ్య యుద్ధంగా పరిణమించింది. అనేక సార్లు గద్దె దిగుతున్నట్లు ప్రకటించి కూడా వెనక్కి తగ్గిన అబ్దుల్లా సలే చివరికి గాయాలతో దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చింది.

వ్యాఖ్యానించండి