ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే


భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు. ఆయన డిమాండ్లను చర్చించి పరిష్కరించుకోవచ్చని తెలిపాడు. అంతే కాకుండా ఆయన ఢిల్లీలో స్వంత విమానంలో దిగే సమయానికి విమానాశ్రయానికి నలుగురు కేంద్ర మంత్రులను పంపించడం సంచలనంగా మారింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అన్నా హజారే పత్రికలతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించాడు.

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించింది” అని హజారే విమర్శించాడు. రామ్ దేవ్ దీక్షకు మద్దతు తెలుపుతూ “రామ్ దేవ్ తో చర్చలు జరపడానికి ఒకళ్ళో ఇద్దరో మంత్రులు చాలు. నలుగురు మంత్రులు అవసరం లేదు. మమ్మల్ని మోసం చేసినట్లే రామ్ దేవ్ ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. వాళ్ళిప్పుడు చర్చలనే అంటారు. ఆ తర్వాత వాటి గురించి మర్చి పోతారు. అందువలన ముందు మమ్మల్ని దీక్షను ప్రారంభించనివ్వండి. దీక్ష మొదలు పెట్టాకే చర్చలు” అని ఆయన పత్రికలతో మాట్లాడుతూ అన్నాడు. ప్రజా ప్రతినిధులు, అధికారుల అవినీతిని విచారించడానికి లోక్ పాల్ బిల్లును రూపొందించే నిమిత్తం పది మందితో కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం హజారే డిమాండ్ మేరకు కమిటీలొ ఐదుగురిని పౌర సమాజం నుండి నియమించింది. తీరా నియామకం జరిగాక కేంద్ర మంత్రులు పౌర సమాజ సభ్యులపై దుష్ప్రజారం ప్రారంభించడంతో కేంద్ర ప్రభుత్వం నిజాయితీపై అనుమానాలు తలెత్తాయి.

మరోవైపు బాబా రాం దేవ్ కి మద్దతు పెరుగుతో పోతోంది. రామ్ దేవ్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలిగిన నలుగురు మంత్రులు రామ్ దేవ్ తో జరిపిన చర్చల్లో కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చిందనీ, మరికొన్నింటి విషయాల్లో స్పష్టత రాలేదనీ రామ్ దేవ్ తెలిపాడు. తదుపరి చర్చల్లో స్పష్టత వస్తుందేమో చూడవలసి ఉందని ఆయన తెలిపాడు. రాందేవ్ నిరాహార దీక్షను మానిపించేందుకు కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నట్లుగా పత్రికలు ఛానెళ్ళు వార్తా కధనాలు ప్రచారం చేస్తున్నాయి. బాబా, అన్నాల దీక్షలతో అవినీతి భూతాన్ని ‘నిరాహారదీక్ష” అనే సీసాలో బంధించి సముద్రంలో విసిరివేద్దామని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

రాందేవ్‌కి హిందూ మత సంస్ధ ఆర్. ఎస్.ఎస్ తో ఉన్న సంబంధాలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. రాందేవ్ మాత్రం తన ఉద్యం రాజకీయాలకు అతీతం అని చెబుతున్నాడు. కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఐన పక్షంలో దేశ వ్యాపితంగా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావడం జరగదని మాజీ ఐ.పి.ఎస్ అధికారి కిరణ్ బేరీ తెలిపింది. అయితే అన్నా హజారే వలే కాక రాందేవ్ ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు ఉన్నత స్ధానంలో ఉన్నవారిని విచారణ నుండి మినహాయించాలని వాదించడం ఈ మొత్తం ఎపిసోడ్ కి కొసమెరుపు. ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అవినీతికి అతీతులుగా ఎలా ఉంటారో రాందేవ్ దేశ ప్రజలకు వివరింవవలసి ఉంంది.

వ్యాఖ్యానించండి