యూరప్‌ని వణికిస్తున్న కీరా దోసకాయ, 10 మంది జర్మన్లు మరణం


cucumbers

యూరప్‌ని వణికిస్తున్న కీర దోస ఇదే

కీర దోసకాయ యూరప్ ఖండం లోని దేశాలను వణికిస్తోంది. ఇ.కోలి బాక్టీరియాతో ఇన్‌ఫెక్ట్ అయి విషతుల్యంగా మారడంతో వాటిని తిన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జర్మనిలో ఇప్పటికే దీని బారిన పడి 10 మంది చనిపోయారు. ఈ కీర దోసకాయలు స్పెయిన్ నుండి దిగుమతి అయినవిగా భావిస్తున్నారు. అయితే ఇవి బయలుదేరిన చోటనే ఇన్‌వెక్షన్ కి గురయ్యాయా లేక రవాణాలో ఇన్‌ఫెక్షన్ ని గురయ్యాయా అన్నది ఇంకా తేలలేదు. ఈ దోస కాయలు ఇప్పటికే అర డజను పైగా దేశాలకు రవాణా అయ్యాయని భావిస్తున్నారు. ఈ వార్తలతో ఇతర కూరగాయలను కూడా వినియోగించడానికి భయపడే పరిస్ధితి తలెత్తింది.

జర్మనీలో కొన్ని వందలమంది జబ్బుకు గురయ్యారు. ముఖ్యంగా హ్యాంబర్గు నగరం లోనూ, దానీ చుట్టూతా ఉన్న ప్రాంతాల్లోనూ ఉన్నవారు దీని బారిన పడ్డట్టుగా గుర్తించారు. ఇ.కోలి (Escherichia coli) బాక్టీరియా సాధారణంగా పెద్ద పేగుల్లో కనిపిస్తుంది. ఇ.కోలి బాక్టీరియాల్లో అనేక రకాలుండగా చాలా వరకూ ప్రమాదరహితమేనని తెలుస్తోంది. ప్రాణాంతక బాక్టీరియాతో జబ్బు చేసిన వారు హీమోలిటిక్-యురేమిక్ సిండ్రోమ్ (హెచ్.యు.ఎస్) తో

E coli 10000 times

పది వేల రెట్ల పరిమాణానికి పెంచిన ఇ.కోలి బాక్టిరియా (click to enlarge)

బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీని వలన కిడ్నీలు విఫలం కావడంతో పాటు కేంద్ర నాడీ మండలాన్ని దెబ్బ తీస్తుందని వైద్యులు చెప్పారు. చెక్ రిపబ్లిక్ అధికారులు తమ దేశానికి కూడా స్పెయిన్ నుండి దిగుమతి ఐనట్లు భావిస్తున్నారు. చెక్‌ రిపబ్లిక్ తో పాటు ఆస్ట్రియా, హంగెరీ, లక్సెంబర్గ్ లకు కూడా రవాణా అయ్యాయని వారు చెబుతున్నారు. చెక్, ఆస్ట్రియాలు స్పెయిన్ నుండి దిగుమతి అయిన కీర దోసలను స్టోర్లనుండి తొలగించారు.

స్వీడన్‌లోని “ఐరోపా వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కేంద్రం” ప్రస్తుతం నమోదైన హెచ్.యు.ఎస్ వ్యాధి వ్యాప్తి ప్రపంచంలో ఇంత పెద్ద స్ధాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారని తెలిపింది. జర్మనీలో కూడా అధిక స్ధాయిలో వ్యాప్తి చెందటం ఇదే ముదటిసారని తెలిపింది.  “హెచ్.యు.ఎస్ కేసులు సాధారణంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కనపడే లక్షణం కాగా, తాజా వ్యాది వ్యాప్తిలో 87 శాతం పెద్దవారే బాధితులుగా ఉన్నారనీ, అందులో కూడా 68 శాతం మంది మహిళలే వ్యాధికి గురయ్యారనీ తెలిపింది. హెచ్.యు.ఎస్ కేసులు స్వీడన్, డెన్మార్లు, హాలండు, బ్రిటన్ లలో కూడా నమోదయ్యాయని బిబిసి తెలిపింది. ఈ కేసులు జర్మనీనుండి ప్రయాణం చేసినవారుగా తెలుస్తోంది. ప్రమాదకరంగా మారిన ఇన్‌వెక్షన్ కి గురైనవారు ఏదో రకంగా జర్మనీకి సంబంధం (జర్మనీకి వెళ్ళి వచ్చినవారు, అక్కడినుండి వచ్చినవారు, వారితో సమీపంగా మెలిగినవారు మొ.) కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మున్‌స్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త హెల్గే కార్చ్, కీరా దోస నుండి నేరుగా ఇన్‌ఫెక్షన్‌కి గురైనవారు కాకుండా మరింతమంది సెకండరీ ఇన్‌ఫెక్షన్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాడు. సెకండరీ ఇన్‌ఫెక్షన్ అనేది పురుషుడినుండి పురుషుడికి వ్యాపిస్తుందనీ, అది నివారించ దగ్గదే నని ఆయన తెలీపాడు. వ్యక్తిగతంగా శుభ్రతను పాటించడం ద్వారా ఆ నివారణ సాధించవచ్చని తెలిపాడు. యూరోపియన్ యూనియన్ కి చెందిన రేపిడ్ వార్నింగ్ సిస్టం ద్వారా కీర దోస చెక్ రిపబ్లిక్ కి చేరుకున్నట్లు తెలిసిందని అక్కడి అధికారులు తెలిపారు. కీర దోస హంగెరీ, ఆస్ట్రియా, లక్సెంబర్గులకు కూడా రవాణా అయిందని జర్మన్లు చెప్పారని చెక్ కి చెందిన వ్యవసాయ, అహార పరిశోధనా సంస్ధ ప్రతినిధి మిఖాల్ స్పాసిల్ ని ఉటంకిస్తూ బిబిసి తెలిపింది.

ఇదిలా ఉండగా స్పెయిన్‌లోని రెండు గ్రీన్ హౌస్‌లనుండి ఈ కీర దోస పంపిణీ జరిగినట్లు గుర్తించినట్లు ఇ.యు ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్కడి కార్యకలాపాలను బంద్ చేసారు. ఇ.కోలితో విషతుల్యం కావడం అక్కడ జరిగిందా లేక ఆ ప్రాంతం దాటిన తర్వాత ఇన్‌ఫెక్ట్ అయ్యాయా అని తెలుసుకోవడానికి అక్కడి అధికారులు పరిశోధన చేస్తున్నారని ఆయన తెలిపాడు.

వ్యాఖ్యానించండి