“కులములో ఏముందిరా?” పాత పాట, మంచి పాట!


పాత తెలుగు సినిమా పాటలపై తెలుగు వారి మమకారం శాశ్వతమేనేమో! సందర్భశుద్ధితో రాయడం, సినిమా కధకు తగిన పాటలు కావడం, సందర్భాలకు తగిన విధంగా రాసిన సాహిత్యానికి ఆ తర్వాత మాత్రమే సంగీతం సమకూర్చడం… ఈ కారణాల వలన అప్పటి పాటలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో, గుండెల్లో, నాలుకలపైనా తిష్టవేయగలిగాయి. మరీ ముఖ్యంగా సమాజంలోని వాస్తవ స్ధితిగతులతో సినిమా కధలకు దగ్గరి సంబంధం ఉండడం, ఆయా సినిమా కధల్లోని వివిధ పాత్రలతో తమ నిజ జీవితాలనూ, జీవిత సమస్యలనూ వెతుక్కోవడం, ఆయా పాత్రలలో తమను తాము ఐడెంటిఫై చేసుకోవడం వలన కూడా పాత సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలూ ఇప్పటికీ జీవంతో తొణికిసలాడుతుంటాయి. అటువంటి పాటల్లో ఒకటి ఇక్కడ వీడియోతో సహా…

<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/xb9QhEcId-4?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>

వ్యాఖ్యానించండి