ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు


అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న మిత్రుడు కాని మిత్రుడికి చెప్పకుండా అతని బెడ్ రూంలోకి జొరబడి శత్రువుని అంతం చేసింది అమెరికా. అప్పుడే అక్కడికి వచ్చిన పాకిస్ధాన్ అది చూసి కన్నంలో వేలుతో దొరికి పోయింది. కానీ పాకిస్ధాన్ తడుముకోకుండా “లాడెన్ ఇక్కడికెలా వచ్చాడు?” అని అడుగుతోంది. అమెరికా రెండో సారి బిత్తర పోయింది. ఇంతకీ ఏది నిజం?

లాడెన్‌ని అమెరికాకి తెలియకుండా ఇప్పటిదాకా పాకిస్ధానే దాచిందా? ఎప్పుడో చనిపోయిన బిన్ లాడెన్ శవాన్ని భద్రం చేసిన అమెరికా, పాక్‌కి తెలియకుండా దాని బెడ్ రూంలో పెట్టి ఇప్పుడే చంపానని నాటకమాడుతోందా? పాకిస్ధాన్‌కి లాడెన్ మితృడా లేక అమెరికా మితృడా? అమెరికాకి లాడెన్ మితృడా లేక పాకిస్ధాన్ మితృడా? లాడెన్‌కి పాక్ మితృడా లేక అమెరికా మితృడా? ఎవరు ఎవరికి మితృడు? ఎవరు ఎవరికి శతృవు? ఈ నాలుగు స్తంభాలాటలో (ప్రపంచ ప్రేక్షక ప్రజలు నాలుగో స్తంభం) గెలుపెవరిది? లాడెన్‌ హత్యతో ఆట ముగిసిందా, లేదా? కొన్ని కార్టూన్లు.

వ్యాఖ్యానించండి