ప్రియుడి మోసంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ కెమెరా కంటికి చిక్కిన పెళ్ళి కూతురు -ఫొటోలు


చైనాలోని జిలిన్ రాష్ట్రంలోని చాంగ్‌చువాన్ పట్టణంలో 22 ఏళ్ళ యువతి ఏడంతుస్తల భవనంలోని ఏడో అంతస్తునుండి దూకి అత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.  నాలుగేళ్ళుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు చివరి నిమిషంలో పెళ్ళికి నిరాకరించడంతో పెళ్లి దుస్తుల్లోనే అత్మహత్యకి ప్రయత్నించింది. అయితే ఆమె అత్మహత్యకు ప్రయత్నిస్తుండగా చూసిన గువో ఝాంగ్‌ఫాన్ అనే స్ధానిక అధికారి, కిటికీనుండి దూకబోతున్న అమెను దూకిన క్షణాల్లోనే సమయానికి పట్టుకోవడంతో ఆమె బతికిపోయింది. ఆమెకు గాయాలేవీ తగల్లేదని తెలిసింది. సదరు దృశ్యాలను కింది ఫోటోలలో చూడవచ్చు.

వ్యాఖ్యానించండి