పశ్చిమాసియాలో అరబ్ విప్లవాల నేపధ్యంలో ప్రత్యక్షంగా కనపడని పరోక్ష యుద్ధం ఒకటి సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరో వైపు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పరోక్ష యుద్ధంలో గెలవడానికి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుంటే ఇరాన్ మాత్రం నింపాదిగా జరిగేది చూస్తూ ఉంది. ఇరాన్ విరోధులు ఇరాన్ ప్రమేయం లేకుండానే ప్రజల తిరుగుబాట్లలో నేలకొరుగుతుంటే ఇరాన్ చేయవలసిందేముంటుంది గనక?
ఈజిప్టులో ముబారక్ శకం ముగిసింది. ఇరాన్ విరోధి సౌదీ అరేబియా మిత్రులు బహ్రెయిన్, యెమెన్ లు నిరసనలపై విరుచుకుపడుతూ మరింత వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. నిరసనల అణచివేతలో సౌదీ అరేబియా తాను ఓ చెయ్యేస్తోంది. బహ్రెయిన్ కి తన సైన్యాన్ని పంపింది. సెక్యులరిస్టు బాత్ పార్టీ ఆద్వర్యంలోని సిరియా సైతం నిరసనలను ఎదుర్కొంటోంది. కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తున్నట్లుంది ఇరాన్ కి.
ఫహాద్ బహాడి సిరియా కార్టూనిస్టు. ఆయన బ్లాగ్ లొ మే 17న ఈ కార్టూను ప్రచురించబడింది.
