స్ట్రాస్ కాన్ ఉదంతంతో రూల్స్‌ని సవరించుకున్న ఐ.ఎం.ఎఫ్


IMF logoన్యూయార్క్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు హొటల్ మహిలా వర్కర్ పై రేప్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐ.ఎం.ఎఫ్ మహిళా హింసకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని కార్పులు చేసుకుంది. కొత్త రూల్ ప్రకారం మహిళలను హింస (harassment) కు గురిచేసినట్లయితే క్రమశిక్షణా చర్య తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుండి  కుడా తొలగించవచ్చు. మే 6 న ఆమోదం పొందిన నిబంధనల సమీక్షను గురువారం వెల్లడించారు. 2008 సంవత్సరంలో స్ట్రాస్ కాన్ తన సిబ్బందిలోని మహిళా ఎకనమిస్టుతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేసినట్లు వచ్ఛిన ఆరోపణలపై ఐ.ఎం.ఎఫ్ బోర్టు విచారణ జరిపి పదవీ దుర్వినియోగమ్ చేయలేదని తేల్చింది. అయితే ‘ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్’ కింద కాన్‌ను మందలిస్తూ అటువంటి చర్యలు పునరావృతం కారాదని హెచ్చరించింది.

తాజాగా మరొకసారి కాన్ పై సీరియస్ ఆరోపణలు రావడంతో 2008 నాటి ఘటనకు ఐ.ఎం.ఎఫ్ బోర్డు స్పందన బలహీనంగా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా స్ట్రాస్ కాన్ పై పదే పదే మహిళల పట్ల లైంగిక సంబంధాల కోసం ప్రయత్నించిన ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అప్పటి చర్యను పునహ్ పరిశీలించాల్సిన అవసరం తలెత్తింది. సిబ్బంది ప్రవర్తనపై రూపొందించిన నూతన ప్రమాణాల ప్రకారం సూపర్ వైజర్ స్ధానంలో ఉన్న వ్యక్తి తన కింది సిబ్బందితో సంబంధం పెట్టుకున్నట్లయితే అది ప్రయోజనాల ఘర్షణ (conflict of interests) గా పరిగణిస్తారు. “అటువంటి ఘర్షణ గురించి నివేదించకుండా, పరిష్కరించకుండా ఉన్నట్లయితే అది అసభ్య ప్రవర్తన కిందకు వస్తుంది. క్రమశిక్షణా చర్య తీసుకోవడానికి అది ప్రాతిపదికగా నిలుస్తుంది” అని ఐ.ఎం.ఎఫ్ ప్రతినిధి విలియం ముర్రే తెలిపాడు.

“కొన్ని పరిస్ధితుల్లో అటువంటి సంబంధం హింసగా (harassment) కూడా పరిగణించాల్సి వస్తుంది. అప్పుడు విచారణ జరుపుతాం. హింస జరిగినట్లు రుజువైతే క్రమ శిక్షణా చర్యకు అది ప్రాతిపదిక అవుతుంది. అందుకు శిక్షగా పదవి నుండి తొలగించడం కూడా జరుగుతుంది” అని ముర్రే వివరించాడు. అక్టోబరు 2008లో జరిగిన విచారణలో ఆర్ధికవేత్త పిరోస్కా నేగీ, స్ట్రాస్ కాన్ తనను చేరిన విధానం పదవిని దుర్వినియోగం చేసే పద్దతుల్లోనే ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను బోర్డు తిరస్కరించింది. పరస్పర అంగీకారం ఉందని తేల్చుకుంది. మందలింపుతో సరిపెట్టింది. అయితే కాన్ లో ఉన్న లక్షణం తనను తాను పదే పదే రుజువు చేసుకోవడానికి ప్రయత్నించిందని ఆయనపై ఆరోపణలు స్పష్టం చేశాయి. హోటల్ ఘటన కాన్ సాహసాల్లో ఒకటి మాత్రమే అయి ఉండవచ్చు.

వ్యాఖ్యానించండి