అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -1


ప్రతి సంవత్సరం అమెరికా ప్రపంచ దేశాల మానవ హక్కుల ఆచరణ తీరుపై ఒక నివేదిక వెలువరిస్తుంది. 2010 సంవత్సరానికి కూడా అలావే మానవ హక్కుల నివేదికని వెలువరించింది. అందులో 190కి పైగా దేశాలపై తన తీర్పు రాసుకుంది. 145 పేజీల ఈ నివేదికలో అమెరికా మానవహక్కుల రికార్డు మాత్రం ఉండదు. ప్రపంచంలోనే మానవ హక్కులను ఉల్లంఘించడంలో సంఖ్య రీత్యా, పద్దతుల రీత్యా కూడా మొదటి స్ధానంలో ఉండే అమెరికా తన కింద నలుపు కాదు కదా, ఒళ్ళంతా నలుపే అయినా దానికి ఫర్లేదు. ఎప్పటిలాగే చైనా మానవహక్కుల రికార్డుని అమెరికా దుమ్మెత్తి పోసింది. చైనాకి మానవ హక్కులని గౌరవించడంలో అంత మంచి రికార్డు లేదని అంగీకరించొచ్చు కూడా. కాని ఆ విషయం అమెరికా ఎత్తి చూపడమే వింతల్లో వింత. అయితే చైనా ఈ సంవత్సరం ఓ మంచి పని చేసింది. అమెరికా మానవహక్కులను ఎంత ఘోరంగా ఉల్లంఘిస్తున్నదీ తానొక నివేదికను తయారు చేసి ప్రకటించింది. ఆ నివేదిక తయారు చేయడానికి చైనా, అమెరికాకి చెందిన వివిధ విభాగాలు వెల్లడించీన వివరాలపైనే ఆధారపడడం అసలు విశేషం.

మే 9, 10 తేదీల్లో చైనా అధ్యక్షుడు అమెరికా టూర్ లో ఉండగానే హిల్లరీ క్లింటన్ నోటికి పని చెప్పింది. అరబ్ దేశాల్లాగానే చైనాలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ప్రభుత్వం వాటిని దారుణంగా అణచివేస్తున్నదనీ, ఎల్లకాలం అణచివేత సాగదనీ, అణచివేత శృంఖలాలను చైనా ప్రజ తెంచుకునే సమయం ఎంతో దూరంలో లేదనీ ఓ హెచ్చరిక పడేసింది. అదలా ఉంచితే చైనా మీద అమెరికా ఏప్రిల్ 8 తేదీన మానవహక్కుల నివేదిక ప్రకటిస్తే, చైనా ఏప్రిల్ 10 తేదీన అమెరికా పైన తానొక నివేదిక తయారు చేసి ప్రకటించింది. చైనా వెల్లడించిన వివరాలు వివిధ అంశాల వారీగా విభజించింది. ప్రారంభంలో ఇలా పేర్కొంది.

అంతర్గత సమాచారాన్ని తొక్కి పెట్టిన వివిధ అంశాలు:

కళంకితమైన సొంత మానవహక్కుల ఉల్లంఘనలు, సామాజిక సంక్షోభంలో ఉన్న సమాజం, పోలీసు రాజ్యాల చట్టాలతో దేశీయంగా విధించిన సాయుధ క్యాంపు, ప్రజాస్వామిక స్వేచ్ఛల అణచివేత, అసమ్మతిని నేరంగా ముద్రవేయడం, చట్ట వ్యతిరేక గూఢచర్యం, సమాచార నియంత్రణ, రాజకీయ ఖైదీలకు పారదర్శక విచారణ అనుమతించకుండా చట్టవ్యతిరేక పద్ధతుల్లో వేధించడం, ఇంటా బయటా చిత్ర హింసలను ఒక విధానంగా అమలు చేయడం, ప్రపంచంలో అతిపెద్ద గులాగ్ నిర్వహణ, టార్గెట్ చేసి చంపడం, చట్టవ్యతిరేక డిటెన్షన్ లు, ప్రతి సవాలు లేకుండా చేసుకోడానికి శాశ్వతంగా యుద్ధాలు చేస్తుండడం, తనకు లొంగనందుకు దేశాలను లక్ష్యం చేసుకోవడం, జాలి రహిత రాజ్య హింస, ప్రపంచ స్ధిరత్వానికి ప్రమాదకరంగా పరిణమించడం, అమెరికా అరిస్టోక్రాట్లకు ప్రజల సంపందను చట్టవిరుద్ధంగా దోచి పెట్టడం, మోసాలు చేసి ఎన్నికలు గెలవడం, ప్రజాస్వామ్యం పేరుతో ద్వి పార్టీల నియంతృత్వాన్ని వ్యవస్ధీకరించడం, ఫలితంగా ప్రపంచం అంతా ద్వేషాని గురవడం, దేశీయంగా కూడా ప్రజల ద్వేషం పెరుగుతున్నా లెక్క చెయ్యకపోవడం.

వీటన్నింటి గురించీన వీవరాలను అమెరికా తొక్కిపెడుతున్నదని చైనా నివేదిక తేల్చి చెప్పింది. ఇవి కాక అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనలను చైనా నివేదిక ఇలా వర్గీకరించింది.

1. ప్రజల జీవితం, సంపద, వ్యక్తిగత భద్రత

అమెరికా జస్టిస్ డిపార్టుమెంట్ ప్రకారం ప్రతి ఐదు మంది అమెరికన్లలో ఒకరు ఏదో ఒక నేరానికి బాధితులుగా ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ శాతం.

2009లో

  • 4.3 మిలియన్ల హింసాత్మక నేరాలు జరిగాయి.
  • 15.6 మిలియన్ల సంపదకు సంబంధించిన నేరాలు.
  • 133,000 మిలియన్ల వ్యక్తిగత దొంగతనాలు (దొంగతనాల్లో 12 సం. వయసు నుండే పాల్గొన్నవారు ఉన్నారు)
  • తుపాకులు సులభంగా అందుబాటులో ఉండడం సమస్యను మరింతగా జఠిలం చేస్తున్నది.
  • 200 మిలియన్ల పేలుడు అపకరణాలను ప్రైవేటుగా కలిగి ఉండడం ద్వారా అమెరికా ప్రజ ప్రపంచంలో మొదటి స్ధానంలో ఉంది -రాయిటర్స్
  • ఇది ప్రతి ముగ్గురి నివాసులలో ఇద్దరికి ప్రవేటు తుపాకులు ఉన్నట్లు లెక్క.
  • ఫలితంగా 12,000 మంది తుపాకి కాల్పుల్లో చనిపోతున్నారు.
  • హింసాత్మక నేరాల్లోని ఐదో వంతులో, దొంగతనాల్లోని సగం సంఖ్యలో ఆయుధాలు వాడుతున్నారు.

2. పౌర, రాజకీయ హక్కులు: ఈ అంశంలో తీవ్ర ఉల్లంఘనలు సర్వ సామాన్యం

  • ఏకాంతాన్ని (ప్రైవసీ) భంగం: ఎ.సి.ఎల్.యు గణాంకాల ప్రకారం అక్టోబరు 1, 2008 నుండి జూన్ 2, 2010 వరకు 6,600 ప్రయాణీకులను ఎలాక్ట్రానిక్ ఉపకరణాలతో శల్య పరీక్ష చేసి ఇబ్బంది పెట్టారు.
  • లాప్ టాప్ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు తదితర ఎలెక్ట్రానిక్ ఉపకరణాలలోని సమాచారాన్ని వారి సొంతదారుల ఇస్టానికి వ్యతిరేకంగా, సకారణమైన అనుమానాలేవీ చెప్పకుండా, ఏ తప్పూ చేయకుండానే వెతకడానికి అనుమతి ఇచ్చినందుకు గాను డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పైన పెద్ద సంఖ్యలో లా సూట్లు దాఖలయ్యాయి.
  • కొలంబియన్ జర్నలిస్టు హాల్‌మన్ మోరిస్ పైన అకారణంగా టెర్రరిస్టు చర్యల్లో పాల్గొన్న నేరారోపణ చేస్తూ అమెరికాలో ప్రవేశించడానికి నిరాకరించినందువలన హార్వర్డ్ ఫెలోషిప్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. (కనీసం ఇద్దరు ఇండియా రాయబారులను, ఒక మహిళ, ఒక సిక్కు, వీమానాశ్రయాల్లో శరీరమంతా తడిమారు. సిక్కు రాయబారి చేత తలపాగా ఊడదీయించారు. చీర కట్టుకున్న మహిళా రాయబారిని క్యూలోంచి బైటికి లాగి అక్కడే వళ్ళంతా తడిమారు. -బ్లాగర్)
  • బే ఏరియాలోని ముస్లిం కమ్యూనిటీ ప్రజలను నేరం చేశారన్న అనుమానంతో కాకుండా, కేవలం వారి జాతి, నమ్మకం ల కారణంగా అణచివేతతో కూడిన పరిశోధన చేసి వారిపై నిఘా పెట్టినందుకు గాను, ఎ.సి.ఎల్.యు, ఏసియన్ లా కాకస్, శాన్‌ఫ్రాన్‌సిస్కో బే గార్డియన్ లపైన ఎఫ్.బి.ఐ రికార్డులు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కేసు నమోదయ్యింది.
  • అక్టోబర్ 2010 లో Transportation Security Authority (TSA) ఒక ఆర్డర్ జారి చేసింది. దాని ప్రకారం విమానాశ్రయాల్లో ప్రయాణీకుల శరీరాల్ని పూర్తిగా స్కానింగ్ చెయ్యాలి, లేదా బలవంతంగానైనా చేతులతో శరీరమంతా తడమాలి. ఈ ఆర్డర్ ద్వారా ఏకాంతం, పౌరహక్కులు ఉల్లంఘనకు గురయ్యాయి. కొన్ని కేసుల్లో మత స్వేచ్ఛ కూడా ఉల్లంఘించబడింది.
  • రాష్ట్ర, ఫెడరల్ డిటెన్షన్ లలో టార్చర్ తో పాటు ఇతర హింసలు, అగౌరవంగా చూడడం పెద్ద సమస్యగా మారింది. సమాచారం రాబట్టడానికి, నేరాంగీకారానికీ ఈ చర్యలు సర్వ సాధారణం. మే 12, 2010 న చికాగో ట్రిబ్యూన్ ఓ రిపోర్టు ప్రచురించింది. ప్రజల్ని వారంట్లు లేకుండా అరెస్టులు చేయడం, గోడలకూ ఇనప బెంచీలతో సంకెళ్ళు వేయడం, ఆహారం ఇవ్వకపోవడం, బాత్‌రూంకి వెళ్ళడానికి అనుమతించకపోవడం తదితర చర్యలను తన నివేదికలో పొందుపరిచింది. క్రూరంగా కొట్టడం, ముఖ్యంగా ముస్లింలు, కలర్ ప్రజలను విపరీతంగా కొట్టడం సర్వసాధారణంగా మారింది.
  • 2.4 మిలియన్ల మందిని జైళ్ళలో పెట్టడం ద్వారా జైళ్ళ జనాభాలో అమెరికా అగ్ర స్ధానం పొందింది. అత్యధిక కేసుల్లో అహింసాత్మక నేరాలకి జైళ్ళలో తోసేస్తారు. నల్ల జాతీయులు, లాటిన్ ప్రజలు ఎక్కువగా దీనికి గురవుతున్నారు. క్రిక్కిరిసిపోయిన జైళ్ళు ఒక సమస్య. టార్చర్ చేయడం, కొట్టడం ఎక్కువ. 25,000 మందికి పైగా ఒంటరిగా ఖైదు చేశారు. మనిషిని మాంసపు ముద్దగా మార్చే టార్చర్ తో సమానం ఇది.
  • రాజకీయ ఖైదు, తప్పుడు నేరారోపణలు సాధారణం. టెర్రరిజం, హత్య నేరాలు చేసినట్లు తప్పుడు ఆరోపణలను ముఖ్యంగా, నల్ల జాతీయులు, లాటినోలు, ముస్లింలపై చేయడం ఎక్కువ.
  • ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా చెప్పుకునే అమెరికా ఎన్నికల్లో విజయం ఎక్కువ డబ్బు వసూలు చేయగలవారినే వరిస్తుంది.
  • ఇంటర్నెట్ స్వేచ్ఛని బోధిస్తూనే కఠినమైన ఆంక్షలని విధిస్తుంది. జూన్ 2010 సెనేట్ Protecting Cyberspace as a National Asset Act అనే చట్టాన్ని ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే ఎమర్జెన్సీ ప్రకటించి వెబ్ సైట్లని మూసేసే పూర్తి అధికారం దఖలు పడుతుంది. ఎమర్జెన్సీ పరిస్ధితులు ఉన్నా లేకపోయినా మూసేయవచ్చు. ఫారెన్ పాలసీ మ్యాగజైన ఫిబ్రవరి 17, 2011 సంచిక ప్రకారం ఆ ఫెడరల్ చట్టం “అనేక సమస్యలతో, వైరుధ్యాలతో నిండి ఉంది.”

(ఇంకా ఉంది)

వ్యాఖ్యానించండి