అమెరికాలో పెరుగుతున్న అసమానతలను పూర్తిగా ఎలా వివరించాలో ఆర్ధిక పండితులకు అర్ధం కావడం లేదు. సరఫరా డిమాండ్ లకు సంబంధించిన సాధారణ అంశాలు పని చేశాయన్నది నిజమే. శ్రామికులు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానం “మంచి” మధ్యతరగతి వారికి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బాగా తగ్గించివేశాయి. ప్రపంచీకరణ ప్రపంచ వ్యాపిత మార్కెట్ ను సాధ్యం చేసింది. ఫలితంగా అమెరికాలోని ఖరీదైన నైపుణ్య రహిత కార్మికుల బదులు తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ నైపుణ్య రహిత కార్మికులు అందుబాటులోకి వచ్చారు. సామాజిక మార్పులు కూడా తమ పాత్ర నిర్వహించాయి. ఉదాహరణకి కార్మిక యూనియన్ల తగ్గుదల. ఒకప్పుడు అమెరికా కార్మికవర్గంలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించిన కార్మిక యూనియన్లు ఇప్పుడు 12 శాతం కార్మికులకే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
అసమానతలకు గల కారణంలో అతి పెద్ద భాగం ఏంటంటే ఉన్నత స్ధానాల్లో ఉన్న ఆ 1 శాతం మంది అదే కావాలని కోరుకున్నారు. అత్యంత అనుకూల ఉదాహరణ పన్నుల విధానం. పెట్టుబడి ఆదాయాల (కేపిటల్ గెయిన్స్) పై పన్నులు తగ్గించడం వలన (ధనికుల ఆదాయంలో అత్యధిక భాగం సంపాదించే మార్గం ఇది) అమెరికాలోని అత్యంత ధనికులకి దాదాపు పూర్తి స్వేచ్ఛ స్వారీకి అవకాశం ఇచ్చినట్లయింది. గుత్త స్వామ్యాలు, గుత్త స్వామ్యంతో సమానమైనవీ ఆర్ధిక శక్తికి ఎల్లప్పుడూ వనరులుగా ఉన్నాయి. గత శతాబ్దం ప్రారంభంలో జాన్ డి. రాక్ ఫెల్లర్ దగ్గర్నుండి ఇప్పటి బిల్ గేట్స్ వరకు అదే రుజువుపరుస్తోంది. యాంటి-ట్రస్టు చట్టాలను, ముఖ్యంగా రిపబ్లికన్ల పాలనలో, విచ్చలవిడిగా అమలు చేయడం ఆ 1 శాతం మందికి దేవుడిచ్చిన వరమే అయ్యింది. నేటి అసమానతల అత్యధిక భాగానికి కారణం ద్రవ్య (ఫైనాన్షియల్) వ్యవస్ధను ఇష్టం వచ్చినట్లుగా మానిపులేట్ చేయడమే. ఫైనాన్సు చట్టాల్లో మార్పులను ద్రవ్య పరిశ్రమ డబ్బులిచ్చి (లంచాలు) కొనుగోలు చేసింది. ఆ మార్పుల్ని అమ్మింది కూడా ద్రవ్య పరిశ్రమే. ద్రవ్య పరిశ్రమ పెట్టిన అత్యంత భేషైన పెట్టుబడి ఈ లంచాలే. ద్రవ్య సంస్ధలకు ప్రభుత్వం దాదాపు సున్న వడ్డీకి అప్పులిచ్చింది. ఇక వ్యవస్ధంతా విఫలమయ్యాక సానుకూలమైన నిబంధనలతో ఉదారంగా బెయిల్ ఔట్ లను పంచిపెట్టింది. ప్రయోజనాల ఘర్షణ పట్లా (Conflict of intersts), పారదర్శకా రాహిత్యం పట్లా రెగ్యులేటర్లు చూసీ చూడనట్లు వదిలేశారు.
ఈ దేశంలోని ఉన్నత స్ధానల్లొని ఒక శాతం మంది సొంతం చేసుకున్న సంపదల పరిమాణం చూస్తే ఈ అసమానతలు ఒక్క అమెరికాకి మాత్రమే సాధ్యం అనుకునేందుకు దారితీస్తుంది. ఇక్కడి అసమానతలు ప్రపంచ స్ధాయిలోనే గొప్ప అసమానతలు. ఈ క్రమం మరిన్ని సంవత్సరాలపాటు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇవి తమను తామే అమలులోకి తెచ్చుకోగల సామర్ద్యం కలవి (self-reinforcing). సంపద అధికారాన్ని తెస్తుంది. ఆ అధికారం మరింత సంపదను సమకూర్చి పెడుతుంది. 1980 ల నాటి సేవింగ్స్-అండ్-లోన్ కుంభకోణంలో బ్యాంకర్ చార్లెస్ కీటింగ్ ను కాంగ్రెషనల్ కమిటీ “1.5 మిలియన్ డాలర్లతో మీరు ఎన్నికైన అధికారుల అధికారాన్ని కొనగలరా అనడిగితే “ఖచ్చితంగా కొనవచ్చు” అని చెప్పాడు. ఈ కుంభకోణాన్ని నేటి కుంభకోణాలతో పోలిస్తే దోమను ఏనుగుతో పోల్చినట్లే. ఈ మద్య ‘సిటిజన్స్ యునైటెడ్”
కేసులో సుప్రీం కోర్టు ఎన్నికల ప్రచారంపై పెట్టే ఖర్చుపై పరిమితులను ఎత్తివేయడం ద్వారా, ప్రభుత్వాలను డబ్బుతో కొనగల హక్కును కార్పొరేషన్లకు దఖలు పరిచింది. దాదాపు సెనేట్ లో ఉన్నవారంతా, ప్రతినిధుల సభలోని అత్యధికులు ఆయా చట్ట సభల్లోకి వచ్చేటపుడే ఉన్నత స్ధానల్లోని ఆ ఒక శాతంలో సభ్యులుగా వస్తున్నారు. ఆ 1 శాతం నుండి వచ్చే డబ్బు ద్వారానే వారు చట్ట సభల్లో కొనసాగుతున్నారు. చట్ట సభల్లో ఉండగా ఆ 1 శాతం మందికి సరిగా సేవ చేయగలిగితే, చట్ట సభలనుండి వెళ్ళే నాటికి ఆ 1 శాతం వారినుండి పెద్దమొత్తంలో బహుమతులు అందుతాయని వారికి బాగా తెలుసు. వాణిజ్యం, ఆర్ధిక విభాగాల్లో విధాన రూపకర్తలు కూడా ఆ 1 శాతం నుండి వచ్చినవారే అయి ఉంటున్నారు. ఔషధాలను కొనుగోలు చేసే అత్యంత భారీ వినియోగదారు అయిన ప్రభుత్వం, ఔషధాల ధరలపై బేరమాడడాన్ని నిషేధించే చట్టం చేయడం ద్వారా ట్రిలియన్ డాలర్ల బహుమతిని ఔషధ కంపెనీలకు ఇచ్చినపుడు పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేని పరిస్ధితి ఇప్పుడుంది. ధనికులకి భారీగా పన్నులు తగ్గిస్తే తప్ప పన్నుల చట్టం ఆమోదం పొందలేని పరిస్ధితి ఇప్పుడున్నదంటే నోరు తెరచి మరీ ఆశ్చర్యపడే పరిస్ధితి కాదు. ఉన్నత స్ధానాలోని ఆ 1 శాతానికి ఉన్న శక్తిని చూస్తే వ్యవస్ద ఇలాగే పనిచేస్తుందని మనం ఊహించగలుగుతాము.
అమెరికా అసమానతలు మన సమాజాన్ని పలు రకాలుగా వికృతీకరిస్తున్నది. ప్రజల జీవన శైలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఆ 1 శాతానికి బయట ఉన్నవారు అంతకంతకూ ఎక్కువగా తమ ఆదాయాలకు అతీతమైన అలవాట్లను అనుసరిస్తున్నారు. ట్రికిల్-డౌన్ ఎకనమిక్స్ అనేది ఊహించనలవి కాకపోవచ్చు గానీ ట్రికిల్-డౌన్ ప్రవర్తన (బిహేవిరిజం) మాత్రం వాస్తవం. అసమానతలు మన విదేశీ విధానాన్ని భారీగా వికృతీకరిస్తున్నాయి. ఆ ఒక్క శాతం లోని వారు చాలా అరుదుగా సైన్యంలొ సేవకు ముందుకొస్తారు. దేశం యుద్ధానికి వెళ్లినపుడు పెరిగే పన్నులు ఆ ఒక శాతం మందిపై వీసమెత్తు కూడా భారం మోపవు. నిర్వచనం ప్రకారం దేశీయ ప్రయోజనాలను దేశీయ వనరులతో సమతూక పరిచడానికి సంబంధించినదే విదేశీ విధానం. ఏ విధంగానూ యుద్ధ ఖర్చు భరించని ఆ 1 శాతం అధికారాన్ని చెలాయిస్తుండగా సమతూకం, సంయమనాలు అదృశ్యమై పోతాయి. సాహసలకు పరిమితి ఉండదు. కార్పొరేషన్లు, కాంట్రాక్టర్లే లబ్ధి పొందేది. ఆర్ధిక ప్రపంచీకరణ సూత్రాలు కూడా అలానే రూపొందించబడ్డాయి. వారు వ్యాపారం కోసం దేశాల మద్య పోటీని ప్రోత్సహిస్తారు. అది కార్పొరేషన్లపై పన్నులను తగ్గించడానికి దోహదపడుతుంది. ఆరోగ్య, పర్యావరణల రక్షణలను బలహీన పరుస్తాయి. ఉమ్మడి బేరసారాల హక్కు లాంటి ప్రధాన కార్మిక హక్కులను బలహీన పరుస్తాయి. దానిబదులు కార్మికుల కోసం దేశాల మధ్య పోటీని ప్రోత్సహిస్తే ఏర్పడే పరిస్ధితిని ఒక్కసారి ఊహించండి. ఆర్ధిక భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు పోటీ పడతాయి. సాధారణ వేతనపరుల కార్మికులపై తక్కువ పన్నుల విధించడంలో పోటీపడతాయి. మంచి విధ్య, శుభ్రమైన పర్యావరణం తదితర కార్మికులు ఆకర్ధితులయ్యే సౌకర్యాలను కల్పించడంలొ ప్రభుత్వలు పోటీ పడతాయి. కాని ఆ ఒక శాతం వారికి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఆ ఒక శాతం మంది సమాజంపై మోపే అత్యంత పెద్ద భారం ఏమిటంటే నిజాయితీ, సమాన అవకాశాల లభ్యత ఉమ్మడితనాకి సంభందించిన భావనలు ప్రధాన అంశాలుగా ఉండే ఐడింటెటీని తుడిచిపెట్టడం. అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు గల నిజాయితీ వ్యవస్ధగా అమెరికా చాలా కాలం నుండి చెప్పుకుంటోంది. కాని గణాంకాలు మరో విధమైన వాస్తవాన్ని సూచిస్తున్నాయి. ఓ పేద పౌరుడు, లేదా కనీసం ఒక మధ్య తరగతి పౌరుడు ఉన్నతస్ధానానికి చేరుకొనే అవకాశం మరే ఇతర యూరప దేశంలొ కంటే అమెరికాలో అత్యంత తక్కువగా ఉంది. అవకాశాలు లేని ఈ అన్యాయ వ్యవస్ధే మధ్య ప్రాచ్య వినాశనానికి దారితీసింది. పెరుగుతున్న ఆహార ధరలు, అనేక సంవత్సరాలు కొనసాగుతున్న నిరుద్యోగం అశాంతిని రగిలిస్తున్నాయి. అమెరికాలోని యువతలో ఉన్న 20 శాతం నిరుద్యోగం, (కొన్ని ప్రాంతాల్లొ, కొన్ని సామాజిక గ్రూపుల్లో అంతకు రెట్టింపు ఉన్న నిరుద్యోగం), ప్రతి ఆరుగురు అమెరికన్లలో ఒకరు పూర్తి స్ధాయి ఉద్యోగం కోరుకుంటున్నా దొరకని పరిస్ధితి, ప్రతి 7 అమెరికన్లలో ఒకరు ఫుడ్ స్టాంప్ లపై బతుకున్న పరిస్ధితి, అంతే మంది ఆహార అభధ్రతను ఎదుర్కొంటున్న పరిస్ధితి ఇవన్నీ ఒక శాతం నుండి ఇతరులకి ట్రికిల్ డౌన్ కావడానికి ఏదో ఆటంక పరుస్తున్నది. ఫలితంగా ఎన్నికల్లొ పాల్గొంటున్న యువకుల సంఖ్యను కూడా తగ్గించి వేస్తున్నది.
ఈ వ్యాసం ఆంగ్లంలో “వేనిటీ ఫెయిర్” పత్రికలో అచ్చయింది.
