ప్రజల ప్రయోజనాలకు హాని చేశానని ఒప్పుకున్న దమ్మున్న మంత్రి జైరాం రమేశ్


Jai Ram Ramesh

పర్యావరణ శాఖా మంత్రి జైరాం రమేష్

పర్యావరణ చట్టాల అమలు విషయంలో చాలా సార్లు రాజీ పడ్డానని కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ అంగీకరించారు. అనేక పర్యావరణ ఉల్లంఘనలను తాను మాఫీ చేశానని తెలిపారు. చట్టాల ఉల్లంఘనలను క్రమబద్ధీకరించడానికి తాను బద్ధవ్యతిరేకిననీ, కానీ కొన్ని కేసుల్లో రాజీ పడే విధంగా ఒత్తిడులు వచ్చాయనీ తెలిపారు. జైరాం రమేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టినప్పటినుండీ వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ మంత్రివర్గాలనుండీ విమర్శలను ఎదుర్కొన్నాడు. చట్టాలంటూ ముంకు పట్టు పట్టి అర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకంగా మారాడని విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రధాని మన్మోహన్ నుండి సైతం ఆయన కొన్ని విదేశీ కంపెనీలకోసం పర్యావరణ చట్టాలనుండి చూసి ఛూడనట్లు పోవాలని ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.

ఈ నేపధ్యంలో జైరాం రమేశ్ ఒప్పుకోలు ప్రాధాన్యతను సంతరించుకుంది. జైరాం నేహ్రూ గారి మిశ్ర్మ ఆర్ధిక విధానాలకు ప్రధాన మద్దతుదారు. పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టినప్పటినుండీ కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను తీసుకొని ఇతర మంత్రుల నుండి ఆగ్రహాన్నీ ఎదుర్కొన్నాడు. “చట్టవ్యతిరేకంగా క్రమబద్ధీకరణ చేయడానికి నేను బద్ద వ్యతిరేకిని. అయినా ఒక రిఫైనరీని నిర్మించారు. ఒక ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలను క్రమబద్ధీకరించడంలో నేను దోషిగా మిగిలాను అని చెప్పాడు. స్ధిరమైన అభివృద్ధి పై కొత్త ఢిల్లీలో జరిగిన సెమినార్‌లో మాట్లాడుతూ కొన్ని విషయాలలో రాజీ పడలేదు. మరికొన్ని విషయాల్లూ రాజీపడక తప్పలేదు అని తెలిపాడు.

“చట్ట వ్యతిరేకతను క్రమబద్ధీకరించే ప్రక్రియ ఇండియాకు ప్రత్యేకమైన లక్షణం. మొదట చట్టం చేస్తారు. తర్వాత ఉల్లంఘిస్తారు” అని జైరాం వివరించాడు. గ్రీన్ క్లియరెన్సు ఇచ్చినపుడు విధించిన షరతులను ఉల్లంఘించినప్పటికీ మద్యప్రదేశ్ లోని నర్మదా నదిపై 400 మెగావాట్ల మహేశ్వర్ హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు శుక్రవారం పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకి ఏప్రిల్ 2010 లో పని నిలిపివేయమంటూ ఆర్డర్ జారీ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంతో జరిగిన వివిధ సమావేశాల ఫలితంగా ఆ ఆర్డరును ఎత్తివేయక తప్పలేదు అని రమేష్ తెలిపాడు.

వ్యాఖ్యానించండి