కాందహార్‌లో తాలిబాన్ల దాడి రెండో రోజూ కొనసాగుతోంది.14 మంది తాలిబాన్లను చంపినట్లు ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. చనిపోయిన తాలిబాన్లలో కొద్దిమంది పాకిస్తానీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. దాడి ఒసామా హత్యకు ప్రతీకరంగా చెప్పడాన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు. దాడీ ముందే వేసుకున్న పధకం ప్రకారం జరిగిందని తాలిబాన్ చెప్పినట్లుగా బిబిసి తెలిపీంది. ఇద్దరు భద్రతాధికారులు, ముగ్గురు పౌరులు,
శనివారం తాలిబాన్లు ఆత్మాహుతి బాంబులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. అప్పటినుండీ కాల్పులు కొనసాగుతున్నాయి. మే ప్రారంభంలో వేసవి దాడులు ప్రారంభించనున్నామని తాలిబాన్ ప్రకటించిన సంగతి విదితమే. ఆది వారం ప్రభుత్వ బలగాలు భారీ మెషిన్ గన్లను వినియోగిస్తూన్నాయి. వీరికి సాయంగా విదేశీ సైనికులు కూడా కాల్పులు జరుపుతున్నారు. తాలిబాన్లను ఒకరి తర్వాత ఒకరిని చంపుతామని ప్రగల్భాలు పలికిన గవర్నరు వేసా “తాలిబాన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు” అని ఒప్పుకోక తప్పలేదు.
2001 లో ఆఫ్ఘనిస్ధాన్‌పై దురాక్రమణ యుద్దం మొదలయ్యాక తాలిబాన్లు చేస్తున్న అతిపెద్ద దాడిగా బిబిసి విలేఖరి అభివర్ణించాడు. ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన దురాక్రమణ సైన్యానికి ఇది “ఇబ్బంది కలిగించే దాడి” అని ఆయన వర్ణించాడు. పశ్చిమ దేశాల కీలుబొమ్మ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఓ విచిత్ర ప్రకటన జారీ చేశాడు. ఒసామా బిన్ లాడెన్ హత్య ద్వారా సంభవించిన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి తాలిబాన్ పౌరులపై దాడి చేస్తున్నదని ఆయన ప్రకటించాడు. పౌరుల రక్షణ కోసం బాంబులు వేయడం యుద్దం చేయడం ఇప్పుడు ఊతపదం ఐపోయింది. వాటిల్లో పౌరులే చనిపోవడం అసలు విషయం.
“ఇది వేసవి కాలపు బ్రహ్మాండపు దాడి. అది తిప్పి కొట్టబడింది” అని అంతర్జాతీయ భద్రతా సహాయ బలగాల ప్రతినిధి మేజర్ జనరల్ మేజర్ జనరల్ లాస్టర్ చెప్పాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్ధాన్‌లో 130,000 విదేశీ బలగాలు తిష్టవేసి ఉన్నాయి. వీరిలో అత్యధికులు అమెరికా సేనలు. గత నెల జైలునుండి 500 మందికి పైగా తాలిబాన్లు తప్పించుకున్న ఫలితమే ఈ దాడి అని కాందహార్‌లోని సీనియర్ పోలిస్ అధికారి అభిప్రాయపడ్డాడు. కాందహార్ తాలిబాన్లకు పుట్టిల్లులాంటిది. గత సంవత్సర కాలంగా కాందహార్ కేంద్రంగా తాలిబాన్ల జాతీయోద్యమం నడుస్తున్నది.
