ఒసామా ఓ సీరియస్ విద్యార్ధి -తైవానీస్ జుడో కోచ్ జిమ్మీ వూ


osama judo

జిమ్ వూ, ఒసామా

“ఒసామా నేను కోచింగ్ ఇచ్చిన విద్యార్ధుల్లో ప్రత్యేక విద్యార్ధి. అతని ఎత్తువలన ప్రత్యేకం అని చెప్పడం లేదు. అతని సీరియస్‌నెస్, అతని కన్సర్వేటివ్ భావాలు అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి” అని ఒసామాకు విద్యార్ధి దశలో జుడో కోచింగ్ ఇచ్చాడని భావిస్తున్న జిమ్ వూ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వూలే చెప్పాడు. అప్పటి ఒసామాయే ఇప్పటి ఒసామా బిన్ లాడెన్ అని నిర్ధారించలేక పోతున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తాయిచుంగ్ నగరంలో జరుగుతున్న జుడో టోర్నమెంటు సందర్భంగా జిమ్ వూను రాయిటర్స్ ఇంటర్వూ చేసింది. జిమ్ వూ, 1981, 91 మధ్య కాలంలో సౌదీ అరేబియా జుడో జాతీయ టింకి కోచింగ్ ఇచ్చాడనీ, కోచింగ్ తీసుకున్న వారిలో ఒసామా అనే విద్యార్ధి ఉన్నాడనీ చెప్పినట్లుగా రాయిటర్స్ వివరించింది.

ఒసామా యూనివర్సిటీ విద్యార్ధిగా ఉండగా జుడో కోచింగా తీసుకున్నాడని జిమ్ తెలిపాడు. ఒసామా జుడోకు అవసరమైన దాని కంటే ఎక్కువ ఎత్తు ఉండడంతో విద్యార్ధిగా మొదట నిరాకరించినా పట్టుబట్టడంతో అంగీకరించినట్లుగా తెలిపాడు. “నాకు బిన్ లాడెన్ అన్న పేరు తెలియదు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత నన్ను ఒక సెమినార్ కి ఆహ్వానించారు. పాత విద్యార్ధులు కొంతమంది అక్కడ నాతో అన్నారు. ‘జిమ్మీ, ఒసామా, ఇప్పుడు మన హీరో’ అని. నేను ఆశ్చర్యపోయాను. కొన్ని ఫోటోలు వెతికి ‘ఓహో, ఇతనా’ అన్నాను. అతని గురించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. జిమ్‌తో ఒసామా కలిసి తీసుకున్న ఫోటోలను రాయిటర్స్ కి చూపినట్లుగా ఆ సంస్ధ తెలిపింది. వారానికి రెండు మూడు సార్లు వచ్చి కోచింగ్ తీసుకున్న ఒసామా, 1984 తర్వాత మళ్ళీ తనకు కనపడలేదని జిమ్ తెలిపాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరుడైన జిమ్ వూ, సిడ్నీ, తైవాన్, మిడిల్ ఈస్ట్ ల మధ్య తిరుగుతుంటానని చెప్పాడు. తానొకసారి షాపింగ్‌కి వస్తానని తన భార్యకు చెప్పి లేటయిన విషయాన్ని జిమ్ గుర్తు తెచ్చుకున్నాడు. “నా కోసం నా భార్య కోచింగ్ సెంటర్‌కి వచ్చింది. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది చూసి నవ్వారు. విద్యార్ధుల్లోంచి ఎత్తుగా ఉన్నతను ముందుకొచ్చి ఎవరామె అనడిగాడు. నా భార్యని చెప్పాను. అప్పుడతను ‘ఇది సెంటర్. ఆడవారెవరూ ఇక్కడ ఉండకూడదు’ అని అన్నాడు. ఈ సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది. అతనే ఒసామా” అని జిమ్ వూ చెప్పాడు. అయితే, జిమ్ వూ వర్ణించినంత ఎత్తుగా ఒసామా ఫొటోలో కనిపించడం లేదు, జిమ్ వూ ఏదైనా ఎత్తైన వస్తువుపై నిలబడి ఉంటే తప్ప.

4 thoughts on “ఒసామా ఓ సీరియస్ విద్యార్ధి -తైవానీస్ జుడో కోచ్ జిమ్మీ వూ

  1. ఇది సెంటర్. ఆడవారెవరూ ఇక్కడ ఉండకూడదు’ అని అన్నాడు. ఈ సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది. అతనే ఒబామా” అని జిమ్ వూ చెప్పాడు

    ఇంతకీ ఈ మాట అన్నది ఒబామానా? ఒసానా?

  2. ఇది సెంటర్. ఆడవారెవరూ ఇక్కడ ఉండకూడదు’ అని అన్నాడు. ఈ సంఘటన నాకు బాగా గుర్తుండిపోయింది. అతనే ఒబామా” అని జిమ్ వూ చెప్పాడు

    ఇంతకీ ఈ మాట అన్నది ఎవరు ? ఒబామా? లేక ఒసామా?

  3. భాస్కర్ గారు

    సారీ. పేరు తప్పు రాశాను. చూసుకోలేదు. గుర్తించి తెలిపినందుకు కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి