లిబియాలో స్పెయిన్ విలేఖరి అరెస్ట్, అరెస్టైనవారంతా క్షేమం


Brabo

Brabo

ఏప్రిల్ 5 తేదీన కనపడకుండా పోయిన స్పెయిన్‌కి చెందిన ఫోటో జర్నలిస్టు ఆదివారం స్పెయిన్‌లో తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు. బ్రెగా పట్టణం శివార్లలో ఉన్న మను బ్రాబో ఇతర విలేఖరులతో పాటు అరెస్టు అయ్యాడు. సరైన అనుమతి లేకుండా లిబియాలోకి ప్రవేశించడంతో వారిని లిబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. మను తండ్రి మాన్యువల్ వరెలా, తన కొడుకు బ్రాబోను మిలట్రీ జైలులో ఉంచారనీ, జైలులో తనను బాగా చూసుకుంటున్నట్లు చెప్పాడని తెలిపినట్లు గా పత్రికలకు తెలిపాడు.

జేమ్స్ ఫోలే, క్లార్ మోర్గానా గిల్లిస్ అనే పేర్లు గల అమెరికన్లు, ఏంటొన్ హామర్ల్ అన్న పేరుగల సౌత్ ఆఫ్రికా దేశీయుడు బ్రాబో పాటు అరెస్టు అయ్యాడు. గిల్లిస్ గత గురువారం కనెక్టికట్‌లో ఉన్న తన తల్లి దండ్రులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని తెలియజేసింది. సరైన అనుమతి లేకుండా లిబియాలో ప్రవేశించి ఫోటోలు తీస్తున్నందుకు నలుగురునీ అరెస్టు చేశారని వారు తెలిపారు. తమను ఎప్పుడు విడుదల చేసేదీ తమకు తెలియదని బ్రాబో తెలిపాడు.

“బ్రాబోను సరిగా చూసుకుంటున్నదీ లేనిదీ, తనకీ ఏమైనా సమస్య ఉందేమో నని బ్రాబోని అడిగాను. తను అదేమీ లేదని చెప్పాడు. తనని మిలట్రీ జైలులో ఉంచారనీ, ఇతర జర్నలిస్టులను కూడా అదే చోట ఉంచారనీ, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నామనీ తెలిపాడు. అందరికీ భోజనం బాగా పెడుతున్నారనీ, సమస్యలేవీ లేవనీ తను చెప్పాడు” అని వలేరో చెప్పాడు. అయితే హామర్ల్ వారితో లేడని తెలుస్తోంది. కనపడకుండా పోయారని భావిస్తున్న వారంతా క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

వ్యాఖ్యానించండి