తన “మెమొరాండం ఒపీనియన్ అండ్ ఆర్డర్” లో కోర్టు రాణా డిఫెన్స్ వాదనను ప్రస్తావించింది. “పబ్లిక్ అధారిటీ డిఫెన్స్” కింద తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాణా హేడ్లీ సాక్ష్యాన్ని మద్దతుగా ప్రస్తావిస్తున్నాడని కోర్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధికి ఉండే మినహాయింపులను రాణా కోరుతున్నాడు. హేడ్లీ తన సాక్ష్యంలో ఏమేమీ ప్రస్తావించిందీ రాణాకు చెప్పినట్లు తెలపడంతో రాణాకు హేడ్లీ సాక్ష్యాన్ని డివెన్సు గా వినియోగించాడు.
కోర్టు ప్రొసీడింగ్స్ వలన పాకిస్తాన్ కి నష్టం రాకుండా ఉండడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు “టైమ్స్ ఆఫ్ ఇండియా” పత్రిక బుధవారం తన వెబ్ సైట్ లో పేర్కోంది. టెర్రర్ ని ప్రోత్సహించడంలో ఐ.ఎస్.ఐ పాత్ర పట్ల అసంతృప్తితో ఉన్నప్పటికీ అమెరికా, పాకిస్తాన్ ను ఇబ్బందినుండి బైటపడేయడానికి ప్రయత్నిస్తోందనీ, రేమండ్ డేవిస్ (ఈ ఉదంతంపై వివరాల కోసం ఇదే బ్ల్గాగ్ లో నిన్న పోస్ట్ అయిన వార్తను చూడగలరు) ఘటన ద్వారా పాకిస్తాన్ తో నష్టపోయిన సంబంధాలు బాగు చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆ పత్రిక రాసింది.
అయితే రాణా డిఫెన్సును కోర్టు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అమెరికాలోని చట్టాల ప్రకారం ఐ.ఎస్.ఐకి ఇండియాలో పాకిస్తాన్ కి ఉన్న ప్రయోజనాలను సంరక్షించుకునే హక్కు ఉంటుంది. అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇతర స్వతంత్ర దేశాల్లొ జోక్య చేసుకోవడానికి తయారు చేసిన నడమంత్రపు చట్టాం ఇది. ఫారెన్ సావరిన్ ఇమ్యూనిటీస్ యాక్ట్ అని ఈ చట్టాన్ని పిలుస్తారు.
ఇదిలా ఉండగా ముంబై హోటల్ తాజ్ పై టెర్రరిస్టు దాడులకు పాల్పడ్డ పాకిస్తాన్ టెర్రరిస్టులు ముంబైకి సముద్రం ద్వారా ప్రయాణం చేయడానికి వినియోగించిన పడవ “కుబర్” సొంతదారు సోదరుడు ఆత్మహాత్యా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. పోరుబందర్ లో నర్సింగ్ మసాని విషపదార్ధం తినడం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసుల చిత్రహింసలకు తట్టుకోలేక ఆయన ఈ పనికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది.