విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు


గురువారం “మిలియన్ మార్చ్” సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చివేశారని డిజిపి ప్రకటించడం సరికాదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఓ విలేఖరితో మాట్లాడుతూ ఖండించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా డిజిపి ప్రకటన జారీ చేయడం తగదని ఐ.ఎఫ్.టి.యు జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ హైద్రాబాద్ లో ఈటివితో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. టాంక్ బండ్ ప్రదర్శనలో అన్ని పార్టీలు, సంఘాల వారు పాల్గొన్నారనీ, పైగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు ప్రతిజ్గ్న చేసిన వెంటనే తిరిగి వచ్చారు తప్ప విగ్రహాల కూల్చివేతలో తమ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్ విజయనగరం నుండి ఫోన్ లో తెలిపారు.

టాంక్ బండ్ మీదికి ఆందోళనకారులు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు గట్టి బందోబస్తులో ఉన్నారనీ వారి బారికేడ్లను, బందోబస్తునూ మొదటిసారి ఛేదిస్తూ టాంక్ బండ్ మీదికి దూసుకు వచ్చింది ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలేనని అందుకే పోలీసులు ఐ.ఎఫ్.టి.యు ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోందనీ ప్రదీప్ వివరించారు. “సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ముగిశాక తమ కార్యకర్తలు అక్కడినుండి వచ్చేశారు. ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినవారు. ఎటువంటి పరిస్ధితుల్లోనూ విగ్రహాలను కూలగొట్టే అరాచక చర్యలకు వారు పూనుకోరు. సంఘ చరిత్ర పరిశీలించినవారికి ఎవరికైనా ఇది అర్ధం అవుతుంది.” అని ప్రదీప్ చెప్పారు.

4 thoughts on “విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు

  1. సాక్షి పేపర్ వాళ్లు “పెళ్ళి పేరుతో మస్కా కొట్టి న్యూ డెమొక్రసీ పార్టీ వాళ్ళు అందరి కంటే ముందుగా టాంక్ బండ్ పైకి వచ్చారని రాశారు. ఆ విషయం మీకు తెలియదా? -భాస్కర్

వ్యాఖ్యానించండి