అమెరికా, నెంబర్ 1 ఇంటర్నెట్ స్వేచ్చా హంతకి
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో…
