జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి అనేక జబ్బులు చుట్టుముట్టి మరణాల సంఖ్య బాగా పెరుగుతోందని తెలిపింది. దేశంలో పిల్లల పేరు చెప్పుకుని ఎన్.జి.ఒ సంస్ధలు అనేకం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారికి అందుతున్న నిధులు బాధితుల వరకూ చేరడంలేదని ‘ఆల్ జజీరా’ వార్తా సంస్ధ తెలిపింది.

యెమెన్ లో మెజారిటీ ప్రజలు పేదలే. ఆయిల్ సంపద అంతా ప్రవేటు కంపెనీలు, నియంతృత్వ పాలకులు పంచుకు తింటుండగా దేశ వనరులకు అసలు యజమానులయిన ప్రజలు మాత్రం దరిద్రంలో మగ్గుతున్నారు. అవిద్య వల్ల మతపరమైన మూఢనమ్మకాలు పెచ్చరిల్లి పసి పిల్లలకు అదనపు కష్టాలను తెస్తున్నాయి. వైద్య సౌకర్యాలు మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉండవు. యునిసెఫ్ లాంటి సంస్ధలు రాజధాని నగరంలో తూతూ మంత్రంగా శిబిరాలు నెలకొల్పినా అవేమీ పల్లె జనానికి అక్కరకు రావడం లేదు. ఈ దుర్భర పరిస్ధితుల నుండి పుట్టిన తిరుగుబాటును నియంతృత్వ పాలకులు క్రూరంగా అణచివేస్తుండగా వారికి పశ్చిమ దేశాలు అండగా నిలుస్తున్నాయి. సిరియాలో లేని తిరుగుబాటుకి ఆయుధాలు సరఫరా చేస్తూ, మిలియన్ల కొద్దీ తగలేస్తున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు యెమెన్ లో ప్రజలను దారుణంగా అణచివేస్తున్నప్పటికీ పట్టించుకోవు. వారి కంపెనీల వ్యాపారాలకు సహకరించే పాలకులు నియంతలైనా, మానవ హక్కులను హరించివేస్తున్నా, ప్రజా తిరుగుబాట్లను అణచివేస్తున్నా వారికి అనవసరం.

ఆల్ జజీరా, రాయిటర్స్, యునిసెఫ్ అందించిన ఫొటోలివి.

-

-

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on జూన్ 16, 2012 by in అవర్గీకృతం and tagged , , , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
చందుతులసి on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
moola on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
చందుతులసి on దురన్ ఆదం: టర్కీలో వినూత్న…
చందుతులసి on ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధ…
చందుతులసి on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధ…
moola on బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్…
moola on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
Thirupalu on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్…
చంద్ర మోహన రావు మోస on వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్…
mallesh methari on సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న…
kk on తెలంగాణ డిమాండ్ ను ఎందుకు…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 586గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 424,633 సార్లు

క్యాలెండరు

జూన్ 2012
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 586గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: