About these ads

టెక్నాలజీ: 2 గంటల్లో అమెరికా చేరగల చైనా సబ్ మెరైన్?

చైనా శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే త్వరలో శబ్ద వేగంతో ప్రయాణించగల జలాంతర్గాములు చైనా అభివృద్ధి చేయవచ్చు. రెండు గంటల్లోనే షాంఘై నుండి శాన్ ఫ్రాన్ సిస్కోకు చైనా జలాంతర్గాములు చేరవచ్చు. ఇంకా చెప్పుకుంటే చైనా ప్రయోగించే టార్పెడోలు సముద్ర గర్భంలో అత్యంత వేగంతో ప్రయాణించి అమెరికన్… చదవడం కొనసాగించండి

About these ads

ఉగ్ర సొరంగాలు కావవి జీవన తరంగాలు -ఫోటోలు

బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతే బలంతో అది వెనక్కి తిరిగి వస్తుంది. బెలూన్ నిండా గాలి నింపి ఒత్తితే, బలహీన చోట్లు చూసుకుని బెలూన్ ను బద్దలు కొట్టుకుంటూ గాలి బైటపడుతుంది. ఇది ప్రకృతి సూత్రం. సామాజిక సూత్రం కూడా. సమకాలీన ప్రపంచంలో… చదవడం కొనసాగించండి

సంక్షోభ ఫలితం, ఫ్రెంచి ప్రభుత్వం రద్దు

ఫ్రాన్స్ లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అక్కడి ప్రభుత్వాన్ని బలి తీసుకున్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొదుపు విధానాలు’ వినాశకరంగా పరిణమించాయని అక్కడి ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ మాంటెబోర్గ్ బహిరంగంగా విమర్శించిన మరుసటి దినమే ప్రభుత్వం రద్దు చేసుకుంటామని ప్రధాని మాన్యువెల్ వాల్స్ అధ్యక్షుడు… చదవడం కొనసాగించండి

అమెరికా పోలీసు హింస: అంతర్జాతీయ విచారణకు డిమాండ్

మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో తెల్లజాతి పోలీసు ఒకరు, యువ నల్లజాతి పౌరుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల అణచివేత సైతం తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. పట్టణంలో ఎవరినీ ఒక చోట నిలబడనీయకుండా పోలీసులు తరిమి కొడుతున్నారు. నేషనల్… చదవడం కొనసాగించండి

ముఖ్యమంత్రుల ఎగతాళికి బి.జె.పి సమర్ధన! -కార్టూన్

“నా ప్రియమైన ఎగతాళి మరియు వెక్కిరింపుల్లారా…” *** మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు బి.జె.పి యేతర పార్టీలకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హుడాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న… చదవడం కొనసాగించండి

ప్రధాని సభల్లో కాంగ్రెస్ సి.ఎంలకు అవమానం -కార్టూన్

‘మొహం చాటేశాడు’ అంటారు. అది ఇదేనేమో! మోడి భక్తాగ్రేసరుల ఎగతాళి, వెక్కిరింపులు, కూతలు ఇతర పార్టీల నేతలకు సమస్యగా మారింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించని నాయకుల పట్ల ఆగ్రహంతో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఎరుగుదుము. సభల్లో తమ సమస్యలపై నాయకులను జనం నిలదీయడం ఎరుగుదుము.… చదవడం కొనసాగించండి

ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం -ఈనాడు

అధ్యయనం సిరీస్ లో 8వ భాగం ఈ వారం ఈనాడులో ప్రచురితం అయింది. నిత్య జీవితాలకు అన్వయించుకుంటూ అర్ధ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే తేలికగా మెదడులోకి ఇంకుతుంది. ఈ అంశాన్ని ఈ వారం చర్చించాను. అర్ధశాస్త్రం ఆర్ధిక పండితులకు మాత్రమే కాకుండా జనానికీ అవసరమే అని… చదవడం కొనసాగించండి

మానవ స్వభావం అనేది ఒకటుందా?

(‘మానవ ప్రవృత్తి, ‘మానవ స్వభావం’, ‘మానవ నైజం’… ఇలాంటి పదబంధాలన్నీ ఒకే అర్ధం ఇచ్చేవి. సమాజంలో మానవ స్వభావం అనేది ఒకటుందని, దాని ప్రకారం ప్రతి మానవుడూ నడుచుకుంటారని ఈ పదాలు మనకు చెబుతాయి. ఈ అంశాన్ని చర్చించమని ఇద్దరు ముగ్గురు మిత్రులు ఈ మెయిల్… చదవడం కొనసాగించండి

ప్రపంచంలో అత్యంత తడి ప్రాంతం మేఘాలయ -ఫోటోలు

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ‘అస్సాంలోని చిరపుంజి’ ఈ ప్రశ్న- సమాధానం చిన్నప్పుడు చిన్న తరగతుల్లో ముఖ్యమైన బిట్ ప్రశ్నగా మాస్టార్లు చెప్పేవాళ్లు. కాలక్రమేణా చిరపుంజి ఆ హోదాను కోల్పోయింది. గతంలో అస్సాంలో ఉన్న చిరపుంజి మేఘాలయ విడిపోయాక కొత్త రాష్ట్రంలో భాగం… చదవడం కొనసాగించండి

ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను ఎవరికీ ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా అనేక రాజ్యాంగ పదవులను ఏకపక్షంగా నియమించుకునే అవకాశాన్ని బి.జె.పి/ఎన్.డి.ఏ సొంతం చేసుకుంది. ప్రజాస్వామ్యం సారమే భిన్నాభిప్రాయానికి విలువ ఇచ్చి గౌరవించడం. ఈ సూత్రం ప్రకారమే అత్యున్నత రాజ్యాంగ పదవులైన లోక్ పాల్, సి.వి.సి,… చదవడం కొనసాగించండి

అమెరికా విమానంపై చైనా ఫైటర్ జెట్ చెక్కర్లు

దక్షిణ చైనా సముద్రంపై గూఢచర్యం నిర్వహించడానికి వచ్చిన అమెరికన్ విమానం చుట్టూ చైనా మిలట్రీ ఫైటర్ జెట్ (ఎస్.యు-27) ప్రమాదకరంగా గిరికీలు కొట్టిందని అమెరికా ఆరోపించింది. కాస్త ఉంటే తమ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ ఢీ కొట్టి ఉండేదేనని ఆందోళన ప్రకటించింది. చైనా మిలట్రీ… చదవడం కొనసాగించండి

యనమల బడ్జెట్: నేల విడిచి సాము -2

5.23 లక్షల కోట్ల మేరకు రాష్ట్ర జి.డి.పి ఉండగలదని అంచనా వేస్తూ రెవిన్యూ లోటు జి.డి.పి లో 1.16 శాతం గానూ, బడ్జెట్ లోటు జి.డి.పి లో 2.3 శాతం గానూ తేల్చారు. ఈ అంకెలు ఆకర్షణీయంగానే ఉన్నా అసలు ఆదాయం, వ్యయం తేలితేగాని ఈ… చదవడం కొనసాగించండి

  • ఖజానా

  • కూడలి

  • బ్లాగ్ గణాంకాలు

    • 987,906 సార్లు
  • కేటగిరీలు

  • Twitter Updates