పాప పుట్టిందా? ఐతే తండ్రిని అడగండి!

(ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయిన ఎం.వి.రమణ మూర్తి ‘ది హిందు‘ పత్రిక రాసిన వ్యాసానికి యధాతధ అనువాదం ఇది. చాలా మంది విస్మరించే ఒక శాస్త్రీయ వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఒక సామూహిక విస్మరణను సవరించుకుంటే ఆడపిల్లల బతుకులకు కాస్తయినా గ్యారంటీ లభిస్తుందని ఆశిస్తూ ఆయన ఈ వ్యాసం రాసినట్లు కనిపిస్తోంది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వ్యవస్థాగత అణచివేతకు రచయిత సూచించిన పరిష్కారానికి పరిమితులు ఉన్నప్పటికీ…