అంధులకు చెవులతో లోకాన్ని చూపుతున్న వి.టి.ఇ

‘సిరి వెన్నెల’ సినిమా చూసారా? అందులో పుట్టుకతో కళ్లులేని ఒక పాపకు కళ్ళులేని మరో యువకుడు (హీరో) తన పిల్లన గ్రోవి ద్వారా ‘బృందావనం’ ను దర్శింపజేస్తాడు. అనగా శబ్ద జ్ఞానం ద్వారా ఒక సుందర దృశ్య రూపాన్ని పాప మనసు చూసేలా చేస్తాడు. ఇటీవల, బహుశా ఓ పదేళ్ళ క్రితం ‘పెళ్లి పందిరి’ పేరుతో మరో సినిమా వచ్చింది. అందులో హీరో గారు కళ్ళు లేని హీరోయిన్ తో తన కళ్ళతోనే లోకాన్ని చూడమని చెబుతూ…